‘వై ప్లస్‌’ కేటగిరీలో జయప్రద

6 Apr, 2019 10:38 IST|Sakshi

ఉత్తరప్రదేశ్‌ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సినీ నటి జయప్రద, జానపద గాయకుడు దినేశ్‌లాల్‌ యాదవ్‌కు పోలీసులు వై ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పించారు. జయప్రద రాంపూర్‌ నియోజకవర్గం నుంచి, దినేశ్‌ ఆజంఘఢ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ ఆదేశాల మేరకు వీరిద్దరికీ వై ప్లస్‌ భద్రత కల్పించినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ఆజంఘఢ్‌ లో దినేశ్‌.. ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో తలపడుతుండగా, జయప్రద.. ఎస్పీ అభ్యర్థి ఆజంఖాన్‌తో ఢీకొంటున్నారు.

వై ప్లస్‌ కేటగిరీ కింద జయప్రద భద్రత కోసం 17 మంది పోలీసులను కేటాయించినట్టు రాంపూర్‌ ఎస్పీ శివహరి మీనా చెప్పారు. వీరిలో ఐదుగురిని జయప్రద ఇంటి దగ్గర పెడతామని, మిగతా వారు షిఫ్టుల వారీగా ఆమెకు ఎస్కార్టుగా ఉంటారని ఆయన వివరించారు. వ్యక్తుల ప్రాణాలకు ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందన్నది మదింపు చేసి ఆ మేరకు భద్రత కల్పిస్తామని ఉత్తరప్రదేశ్‌ హోం శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ చెప్పారు. ముప్పు స్థాయిని బట్టి నాలుగు రకాలుగా.. ఎక్స్, వై, వై ప్లస్, జెడ్, జెడ్‌ + భద్రత కల్పిస్తామన్నారు. జెడ్‌ ప్లస్‌ అన్నిటి కంటే ఎక్కువ కేటగిరీ అని చెప్పారు.

మరిన్ని వార్తలు