బద్ధలైన ‘పుట్టా’ కంచుకోట

22 Mar, 2019 10:40 IST|Sakshi
నెర్రవాడలో ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన యాదవులు

సాక్షి, నెర్రవాడ(చాపాడు): టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్‌కు కంచుకోటగా మారిన మండలంలోని నెర్రవాడలో తమ సామాజిక వర్గీయులైనా యాదవులు ఈ ఎన్నికల్లో షాక్‌ ఇవ్వనున్నారు. పుట్టా తీరును వ్యతిరేకిస్తూ, వైఎస్‌ జగన్‌పై ఇష్టంతో 35 యాదవ కుటుంబీకులు గురువారం ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మేకల శేఖర్, లంకెల జయరాములు, చల్లా గంగన్న, చల్లా శ్రీనివాసులు, పెద్ద వీరయ్య, చల్లా గంగాధర్, పిట్టి నరసింహులు, శ్రీనివాసులు, బండారు సుబ్బయ్య, చింతల సుబ్బరాయుడు, కదిరేపల్లె శ్రీను, పిట్టి శ్రీనివాసులు, లంకెల రామచంద్రయ్య, కురాకు మాధవ, ఇరగబోయిన లక్షుమయ్య, గొగ్గి ఓబులేసు, గాలి బాబు, శివలింగమయ్య, పిట్టి అంజన ప్రసాద్, ప్రకాశ్, ఓబులేసు, గొగ్గి మల్లేషు, సాయి, చింతల బీరేష్, పిట్టి సాయికుమార్, పిట్టి కాశి, చల్లా పెద్ద గంగన్న, చల్లా వెంకటరమణ, మందాల నారాయణ, బండారు చిన్న సుబ్బయ్య, చల్లా చిన్నవీరయ్య, పిట్టి నరసింహులు పార్టీలో చేరారు.

అనంతరం ఎమ్మెల్యేతో పాటు తనయుడు నాగిరెడ్డి ఇంటింటికి తిరిగి ఫ్యాను గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు.కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ రాజశేఖరరెడ్డి, జెడ్పీటీసీ ఎస్సార్‌ బాలనరసింహారెడ్డి, మండల నాయకులు లక్షుమయ్య, ఉప ఎంపీపీ నరసింహారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మదీనా దస్తగిరి, రాష్ట్ర, జిల్లా కార్యదర్శులు శశిథర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి, సీనియర్‌ నాయకులు మడూరు ప్రతాప్‌రెడ్డి, గురివిరెడ్డి, నారాయణరెడ్డి, శ్రీమన్నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు