ప్రతిపక్షాలు ఉమ్మడిగా పోరాడాలి: యశ్వంత్‌ సిన్హా

23 May, 2020 16:05 IST|Sakshi

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా ట్విటర్‌లో విమర్శించారు. ఆయన ట్విటర్‌ వేదికగా స్వందిస్తూ.. వలస కార్మికులు, పేద ప్రజల సమస్యలు ప్రభుత్వానికి కనబడడం, వినబడడం లేదని ఎద్దేవా చేశారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలు వలస కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించారు.

విపక్ష పార్టీలు కేవలం సలహాలు ఇవ్వడానికే పరమితమవుతున్నాయని.. సమస్యలు పరిష్కారానికి అన్ని పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు. వలస కూలీలను స్వస్ధలాలకు పంపేందుకు వారికి సాయంగా  సాయుధ బలగాలను రంగంలోకి దింపాలని డిమాండ్‌ చేస్తూ మే 18న యశ్వంత్‌ సిన్హా నిరసనకు దిగారు. గత కొద్ది కాలంగా కేంద్ర ప్రభుత్వ పనితీరుపై యశ్వంత్‌ సిన్హా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కేంద్రం​ ప్రకటించిన 20లక్షల కోట్ల ప్యాకేజీని మోసపూరిత ప్యాకేజీగా యశ్వంత్‌ సిన్హా అభివర్ణించిన విషయం విదితమే.

చదవండి: లేదంటే జనాల్లో నమ్మకం కోల్పోతారు : యశ్వత్‌ సిన్హా

మరిన్ని వార్తలు