‘కర్ణాటకలో ఏం జరుగుతుందో చూడండి’

7 Jul, 2019 14:49 IST|Sakshi

బెంగళూర్‌ : కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ సర్కార్‌లో చోటుచేసుకున్న సంక్షోభంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో వేచిచూడాలని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. పాలక కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేల రాజీనామా వెనుక బీజేపీ ప్రమేయం ఉందని కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి, కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్యల ఆరోపణలపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.

ప్రస్తుత సంక్షోభంతో తమకు ఎలాంటి సంబంధం లేదని యడ్యూరప్ప స్పష్టం చేశారు. కాగా తనతో 5-6 మంది రెబెల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని, దీనికి సంబంధించిన వివరాలు తాను ఇప్పుడే వెల్లడించలేనని కాంగ్రెస్‌ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా పార్టీ పట్ల విధేయత కనబరుస్తున్నారని చెప్పారు. మరోవైపు ప్రస్తుత సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు ట్రబుట్‌ షూటర్‌గా పేరొందిన కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ రంగంలోకి దిగారు. ఆయన ఇప్పటికే జేడీఎస్‌ చీఫ్‌ హెచ్‌డీ దేవెగౌడతో సంప్రదింపులు జరిపి బీజేపీ వ్యూహాలను చిత్తుచేయడంపై చర్చించారు. ముంబైలోని సోఫిటెల్‌ హోటల్‌లో బస చేసిన అసమ్మతి ఎమ్మెల్యేలను దారికి తెచ్చేందుకు డీకే ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం

మరిన్ని వార్తలు