యడ్యూరప్ప బల పరీక్షకు డెడ్‌లైన్‌ ఫిక్స్‌

26 Jul, 2019 14:30 IST|Sakshi

నేడు సీఎంగా ప్రమాణం చేయనున్న యడ్యూరప్ప

జాలై 31న కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష

గత చరిత్ర పునారావృత్తం అవుతుందన్న కాంగ్రెస్‌

సాక్షి, బెంగళూరు: రాజకీయ సంక్షోభంలో ఉన్న కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ సిద్ధమయింది. ఈరోజు సాయంత్రం ఆరుగంటలకు రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్పీకారం చేయనున్నారు. దీనికి గవర్నర్‌, కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చింది.  అయితే సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం చేసిన అనంతరం అసెంబ్లీలో బల నిరూపణ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న రాజకీయ సంక్షోభం కారణంగా విశ్వాస నిరూపణకు గవర్నర్‌ అనూహ్యాంగా వారికి ఏడు రోజుల సమయం ఇచ్చారు. జూలై 31న శాసనసభలో యడ్యూరప్ప బల పరీక్షను ఎదుర్కోనున్నారు.

గవర్నర్‌ వారికి ఏడు రోజుల సమయం​ కేటాయించడంపై కాంగ్రెస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శాసనసభను బీజేపీ ఓ ప్రయోగశాలగా మార్చిందని మండిపడింది. రాజ్యాంగంలో ఏ అధికారణ ప్రకారం గవర్నర్‌ మెజార్టీకి తక్కువగా ఉన్న పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని ప్రశ్నించింది. ఈచర్య సిగ్గుచేటని ఘటుగా స్పందించింది. ఈ మేరకు పార్టీ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ను పావుగా ఉపయోగించుకుంటోందని విమర్శించింది.

గతంలోలా అసెంబ్లీలో బలం సరిపోక మరోసారి యడ్యూరప్ప రాజీనామా చేయక తప్పదని కాంగ్రెస్‌ జోస్యం చెప్పింది. మరోవైపు యడ్యూరప్ప విశ్వాసపరీక్షపై బీజేపీ నేతలు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టారు. రెబల్‌ ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు కేంద్ర నాయకత్వం ఆపార్టీ నేతలను రంగంలోకి దింపింది. కాంగ్రెస్‌ కూడా మరోసారి రెబల్స్‌ను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలావుండగా రెబల్స్‌పై స్పీకర్‌ తీసుకునే నిర్ణయం ఉ‍త్కంఠగా మారింది. ఇదివరకే ముగ్గురు సభ్యులపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బీజేపీకి కుమారస్వామి మద్దతు!

ఎన్నికల వరకే రాజకీయాలు: ఎమ్మెల్యే శిల్పా

ఇంటింటికీ కాంగ్రెస్‌

జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికే హానికరం

అవినీతి నిర్మూలనకే ‘ముందస్తు న్యాయ పరిశీలన’

ఆదర్శనీయంగా మా పాలన

ఆజం ఖాన్‌పై మండిపడ్డ మహిళా లోకం

కన్నడ పీఠంపై మళ్లీ ‘కమలం’

‘అది నిజంగా గొప్ప విషయం’

రాజగోపాల్‌ రెడ్డి, వివేక్‌ ఆలోచించాలి : రేవంత్‌

జనసేన ‘ఒకే ఒక్కడి’కి నో ఛాన్స్‌

‘మ‌ర‌ణశిక్ష విధించాలనేది మా అభిప్రాయం కాదు’

కర్ణాటక సీఎంగా యెడియూరప్ప

ఇది ఇక్కడితో ఆగిపోదు: సీఎం వైఎస్‌ జగన్‌

మాస్టర్‌ ప్లాన్‌ నివేదించండి 

ఆ మాట చెప్పిన ధైర్యమున్న నేత వైఎస్‌ జగన్‌

అందుకే జ్యుడిషియల్‌ బిల్లు : అంబటి 

ప్రపంచ చరిత్రలోనే ఎవరూ చేయని సాహసం

అందుకే నర‍్సాపురం వచ్చా: నాగబాబు

‘సుబాబుల్ రైతులను ఆదుకుంటాం’

స్విస్‌ చాలెంజ్‌తో భారీ అవినీతి: బుగ్గన

పేరు మార్చిన యడ్డీ.. మరి రాత మారుతుందా?

‘బీజేపీ ఆఫర్‌ బాగా నచ్చింది’

రైతులకు గిట్టుబాటు ధరల కోసమే ఈ బిల్లు

ఈ బిల్లు సీఎం జగన్‌ దార్శనికతకు నిదర్శనం

స్థానికులకు ఉద్యోగాలు.. టీడీపీ వ్యతిరేకమా?

‘మహానేత ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తిచేస్తాం’

గూగుల్‌కు ఊహించని షాక్‌

మా వెనుకున్నది ఆయనే: రెబల్‌ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరోయినా..? ఐటమ్‌ గర్లా?

‘మనం’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌!

చౌడేశ్వరి ఆలయంలో బాలకృష్ణ పూజలు

దిమాక్‌ ఖరాబ్‌.. దిల్‌ ఖుష్‌!

ఇద్దరం.. వెంకటేష్‌ అభిమానులమే..

పాట కోసం రక్తం చిందించాను