పౌర అల్లర్ల వెనుక ‘హస్తం’

23 Dec, 2019 09:19 IST|Sakshi

సోనియాగాంధీ కుట్ర  

సీఎం యడియూరప్ప ఆరోపణ

సాక్షి, బెంగళూరు: పౌరసత్వ సవరణ బిల్లుకు సంబంధించి అల్పసంఖ్యాక వర్గాల నుంచి ఎలాంటి వ్యతిరేకత లేకున్నా, కాంగ్రెస్‌ పార్టీ నేతలు రెచ్చగొట్టి అనవసర రాద్దాంతం చేస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప విమర్శించారు. ఆదివారం ఉదయం విధానసౌధలో ఇటీవల ఉప ఎన్నికల్లో గెలిచిన 13 మంది కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్‌ నేతలు ర్యాలీలు, నిరసనలు చేయడం సరికాదని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలోనే అల్లర్లు కొనసాగుతున్నాయని ఆరోపించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ర్యాలీలు, నిరసనలు, ధర్నాల్లో కాంగ్రెస్‌ నేతల హస్తం ఉందన్నారు. ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యతో పాటు ఏ నాయకుడికి కూడా మంగళూరులో ప్రవేశం నిషేధించలేదన్నారు.

యూటీ ఖాదర్‌ హస్తం
మంగళూరులో పోలీసుల కాల్పుల్లో చనిపోయిన నౌశిల్, జలీల్‌ అనే ఇద్దరు కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున ప్రభుత్వం తరఫున పరిహారం ఇస్తామని సీఎం య తెలిపారు. మంగళూరులో అల్లర్లకు కాంగ్రెస్‌ మాజీ మంత్రి యూటీ ఖాదర్‌ ప్రధాన కారకుడని తన దృష్టికి వచ్చిందన్నారు. అక్కడి పరిస్థితులను పరిశీలించి త్వరలోనే విచారణకు ఆదేశిస్తానని తెలిపారు. 

మరిన్ని వార్తలు