జేబులు నింపుకోవడమే వారి లక్ష్యం

26 Feb, 2018 12:09 IST|Sakshi
మాట్లాడుతున్న ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి రూ.10 నుంచి రూ.13 లక్షలు

ముంపువాసులకుఫ్యాకేజ్‌ పెంచుతాం

జీవనోపాధి కల్పనకు రెండు ఎకరాలు ప్రభుత్వ భూమి పంపిణీ చేపడుతాం

కొండాపురం : ముంపు గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించకుండా పునారవాస కేంద్రాల్లో సిమెంట్‌రోడ్ల పనుల టెండర్లలో మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు  ఫిఫ్టీ–ఫిప్టీ పనులు పంచుకొని వారు జేబులు నింపుకొవడానికికే తప్ప ప్రజలకు మేలు చేయలేదని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తాళ్లప్రొద్దుటూరులో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ కడప  పార్లమెంటరీ  జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు, జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ సుధీర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శంకర్‌రెడ్డితో కలసి ఎంపీ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా వైఎస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయంలో రూ.32 లక్షల ఎకరాలను భూమి లేని నిరుపేదలకు పంచారన్నారు. మహానేత ð మరణించిన తర్వాత ఎవ్వరూ పేదలకు భూమిని పంచలేదన్నారు. ఇవ్వాల భూమిలేని ప్రతి పేదవాడికి భూమి ఇస్తామని ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో కరెంట్‌ బిల్లులు కట్టలేకపోతున్నారని వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామన్నారు. రాజశేఖర్‌రెడ్డి హయంలో నియోజక వర్గంలో 42 వేల గృహాలు మంజూరు చేశారన్నారు.

వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న నియోజకవర్గానికి 50 వేలు గృహలు కట్టిస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వంలో బంగారుతల్లి పథకం కింద  రూ. 20 వేలు ఇస్తామని చెప్పి ఏ ఒక్క హామీ నేరవేర్చలేదన్నారు. రేషన్‌ షాపులో 9 వస్తువులు ఇచ్చేవాళ్లు టీడీపీ ప్రభుత్వంలో బియ్యం కూడా సక్రమంగా ఇవ్వలేదన్నారు. చంద్రబాబు పాలనలో ఒక్క రైతుకు కూడా పూర్తిగా రుణమాఫీ కాలేదని, బంగారు ఇంటికి రాకపోగా బంగారు వేలం నోటీసులు ఇంటి కొస్తున్నాయని ఆయన విమర్శించారు. చంద్రబాబు 13 ఏళ్ల పాలనలో ఒక్క పథకం కూడా ప్రజలకు గుర్తుకురాలేదన్నారు. వైఎస్సార్‌ పేరు చెబితే ఆరోగ్యశ్రీ,, 108 సేవలు, ఉచిత విద్యుత్, జలయజ్ఞం లాంటి పథకాలు గుర్తుకొస్తాయన్నారు. ఏడాదిలోపే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాబోతుందని, రైతులకు గిట్టుబాటు ధర కోసం ధరల స్థిరీకరణతో పాటు రచ్చబండలో తలెత్తిన సమస్యలన్నీంటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సురేష్‌బాబు మాట్లాడుతూ  రచ్చబండ కార్యక్రమం అంటేనే మహానేత దివంగతనేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గుర్తుకొస్తున్నారన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సక్రమంగా అందించాలని సంకల్పంతో రచ్చబండ కార్యక్రమం ప్రవేశపెట్టాడన్నారు. కాబట్టి రచ్చబండలో సమస్యలన్ని రాబోతున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పరిష్కరిస్తామన్నారు. పి.రామసుబ్బారెడ్డి తొమ్మిదేళ్లు గృహనిర్మాణ మంత్రిగా పనిచేసినప్పుడు 9 వేలు గృహాలు కట్టించారన్నారు. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని ఆయన ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. జమ్మలమడుగులో అభివృద్ధి చేస్తా అన్న మంత్రి ఆదినారాయణరెడ్డి ముంపు గ్రామాల్లోకి వచ్చి ఒక్కరోజైనా సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాడా అంటూ ఆయన విమర్శించారు. కచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని వర్గాలవారికి న్యాయం జరుగుతుందన్నారు.  30 ఏళ్ల నుంచి ఆది, రామసుబ్బారెడ్డిలకు బుద్దిచెప్పే రోజులు దగ్గరపడ్డాన్నారు.

సర్వేలో అన్యాయం..
డాక్టర్‌ సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ముంపుగ్రామాల ప్రజలకు తప్పకుండా 10 నుంచి 13 లక్షలు ఫ్యాకేజీ పెంచుతామని రచ్చబండలో ముంపువాసులకు హామీ ఇచ్చారు. రెండో విడత సర్వేలో అన్యాయం జరిగిందని నాదృష్టికి తీసుకొచ్చారని మన ప్రభుత్వం రాగానే రీ సర్వే చేయించి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామన్నారు. గండికోట ప్రాజెక్టు కింద ముంపు నిర్వాసితులు యువకులు, యువతకు 18 ఏళ్లకు రెండు నెలలు  తక్కువ ఉన్నా పరిహారం వర్థింప చేయలేదన్నారు. మన ప్రభుత్వం రాగానే 10 ఏళ్లు, 15 ఏళ్లు వయస్సును బట్టి పరిహారం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్ల ప్రొద్దుటూరు ఎస్‌. రామసుబ్బారెడ్డి, హరినారాయణరెడ్డి, విజయ్‌కుమార్, గొందిశివ, మండల కన్వీనర్‌ నిరంజన్‌రెడ్డి, మండల మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్‌బాషా, జిల్లా కార్యదర్శి రామముని రెడ్డి, కొండాపురం పట్టణ అ««ధ్యక్షుడు వాసుదేవరెడ్డి, మండల యూత్‌ కన్వీనర్‌ లక్ష్మీకాంత్‌రెడ్డి, రైతు విభాగ అధ్యక్షుడు రామనాథరెడ్డి, కోడూరు రామసుబ్బారెడ్డి, రామిరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, సత్యనారాయణరెడ్డి, చింతా రాజారెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు