చంద్రబాబు అసత్య ఆరోపణలు మానుకోవాలి

21 Jul, 2020 10:05 IST|Sakshi
ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డిలకు వినతి పత్రం అందిస్తున్న బలిజ సంఘం నాయకులు

పులివెందుల : ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అసత్య ఆరోపణలు మానుకోవాలని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి హితవు పలికారు. సోమవారం వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలోఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టారన్నారు. శాసన సభలో రెండుసార్లు బిల్లులను ఆమోదించాకే గవర్నర్‌ ఆమోదానికి పంపించినట్లు చెప్పారు. శాసన మండలిలో బిల్లుపై ఓటింగ్‌ పెట్టాలని టీడీపీ మినహా అన్ని పార్టీలు గతంలో కోరాయన్నారు. అయితే మండలంలో సంఖ్యా బలంతో చంద్రబాబు సూచనల మేరకు శాసనమండలి చైర్మన్‌ అనైతికంగా వ్యవహరించారని అన్నారు. నిబంధనలకు అనుగుణంగా రాజధాని బిల్లులను గవర్నర్‌ ఆమోదానికి పంపించినట్లు చెప్పారు. చంద్రబాబుకు రాష్ట్రం అభివృద్ధి చెందితే తట్టుకోలేకపోతున్నాడన్నారు. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతారన్నారు. అనంతరం ఆయన ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

కాపు నేస్తంలో శెట్టి బలిజకు అవకాశం కల్పించాలి  
సోమవారం  ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత వైఎస్‌ మనోహర్‌రెడ్డిలను రాయలసీమ కాపునాడు అధ్యక్షులు వీరా, బలిజ సంఘం నాయకులు ఆంజనేయులు, బ్యాటరీ ప్రసాద్, వీరయ్య, రవిశంకర్‌  కలిశారు. కాపు నేస్తం పథకంలో శెట్టి బలిజలకు వర్తించదని.. కొన్ని సచివాలయాల్లో దరఖాస్తును తిరస్కరిస్తున్నారన్నారు. అలా కాకుండా బలిజ కులస్తులందరికి కాపు నేస్తం వర్తించేలా చూడాలని వినతి పత్రం సమర్పించారు. దీనికి ఎంపీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం బలిజ సంఘం ఆధ్వర్యంలో 20పీపీఈ కిట్లను ఎంపీ చేతులమీదుగా స్థానిక ఏరియా ఆసుపత్రి అధ్యక్షుడు చక్రపాణికి   అందజేశారు. దీనికి ఎంపీ వారిని అభినందించారు.  గత

ప్రభుత్వంలో ఇళ్లు మంజూరైంది.. పేపర్‌కే పరిమితమైంది.. :  సోమవారం ఎంపీ వైఎస్‌ అవినాస్‌రెడ్డిని తొండూరు మండలం మల్లేల గ్రామానికి చెందిన పర్వీన్‌  కలిశారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ  టీడీపీ ప్రభుత్వంలో తనకు ఇళ్లు మంజూరైందని అది పేపర్‌కే పరిమితమైందన్నారు. ఇప్పటివరకు అప్పులు చేసి గోడలు నిర్మించుకున్నానని..తనకు న్యాయం చేయాలని కోరింది. దీనికి ఎంపీ ఈ ప్రభుత్వంలో ఇళ్లు మంజూరు చేయిస్తానని ఆమెకు హామి ఇచ్చారు.  వైఎస్సార్‌సీపీ నేత వైఎస్‌ మనోహర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహారెడ్డిలతో మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు.

మరిన్ని వార్తలు