జమ్మలమడుగులో వైఎస్‌ భారతి రోడ్‌ షో

31 Mar, 2019 14:44 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరుగుతుందని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో ఆదివారం ఆమె రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా  వైఎస్‌ భారతిరెడ్డికి జమ్మలమడుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. వైఎస్‌ భారతిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ప్రచారానికి మంచి స్పందన లభిస్తోందని అన‍్నారు. చంద్రబాబుపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని అన్నారు. వైఎస్‌ జగన్‌ను ప్రజలు బాగా నమ్ముతున్నారని ఆమె పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మూల సుధీర్‌ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని భారతిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

కాగా  వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయాన్ని కోరుతూ.. నిన్న పులివెందులలో వైఎస్‌ భారతిరెడ్డి ప్రచారాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో ఆమె ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఫ్యాన్‌ గుర్తుకే ఓటు వేసి వైఎస్సార్ సీపీని గెలిపించాలని కోరారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడ్డారని..  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆమె విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్‌ 11న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డికి ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో పెరిగిన అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలను తిప్పికొట్టడానికి మార్పు అనివార్యంగా భావించి ప్రతి ఒక్కరూ వైఎస్సార్‌ సీపీకి ఓటు వేయాలని వైఎస్‌ భారతిరెడ్డి కోరారు. 

మరిన్ని వార్తలు