259వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

10 Sep, 2018 08:09 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. 259వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా సోమవారం ఉదయం వైఎస్‌ జగన్‌ విశాఖపట్నం నియోజకవర్గంలోని తాటిచెట్లపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగే మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు. అక్కయ్య పాలెం, దొండపర్తి జంక్షన్‌, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు పాదయాత్ర సాగనుంది.

ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకున్న తర్వాత భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నాం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. వాల్తేరులో బ్రహ్మణుల ఆత్మీయ సదస్సులో వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు. వాల్తేరు మెయిన్‌ రోడ్డు మీదుగా చిన్న వాల్తేరు వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మాటలే మిగిలాయి..

ఉద్యోగాలు లేవు..

పని చేసుకోలేకపోతున్నా..

పింఛన్‌ ఇవ్వలేదు.

పోటెత్తిన పార్వతీపురం

కుట్రలెన్ని చేసినా..సడలదు నా సంకల్పం

299వ రోజు పాదయాత్ర డైరీ

300వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

‘నేనడుగు పెట్టా.. సీసీ కెమెరాలు బంద్‌’

గ్రాఫిక్స్‌ ఉంది.. రాజధాని ఏది బాబూ?: వైఎస్‌ జగన్‌

అర్హతున్నా ఉద్యోగాలు రావడం లేదన్నా!