264వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

17 Sep, 2018 08:12 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం వైఎస్‌ జగన్‌.. భీమిలి నియోజకవర్గంలోని గుమ్మడివాని పాలెం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు.

అక్కడి నుంచి నీలకుండీల జంక్షన్‌, మిందివాని పాలెం, గుడిలోవ జంక్షన్‌ మీదుగా తర్లువాడ క్రాస్‌ వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ వైఎస్‌ జగన్‌  భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. అనంతరం ఎల్‌వీ పాలెం మీదుగా ఆనందపురం జంక్షన్‌ వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం ఆనందపురం జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.


 

మరిన్ని వార్తలు