315వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

7 Dec, 2018 09:06 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతూంది. జననేత 315వ రోజు పాదయాత్రను శుక్రవారం ఉదయం ఎచ్చెర్ల శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి ఎస్‌.ఎం పురం, కేశవరావు పేట, లక్ష్ముడి పేట, నవభారత్‌నగర్‌ మీదుగా ఫరీదుపేట వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది.

వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు తమ ప్రాంతానికి రానున్నాడనీ.. తమ జీవితాల్లోకి వెలుగులు తెచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయనతో తమ గోడు చెప్పుకుని గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని జనం ఆరాట పడుతున్నారు. జననేత తమ ప్రాంతానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. జననేత ఇప్పటివరకు 3,400.7 కిలోమీటర్లు నడిచారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రతి అడుగూ ఓ భరోసాగా..!

322వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నా..

321వ రోజు పాదయాత్ర డైరీ

దిగ్విజయంగా కొనసాగుతున్న జననేత పాదయాత్ర

చిరునవ్వే ఇంధనంగా..