అమిత్‌ షాతో వైఎస్‌ జగన్‌ భేటీ

26 May, 2019 12:55 IST|Sakshi

అమిత్‌ షాను మర్యాదపూర్వకంగా కలిసిన వైఎస్‌ జగన్‌

సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు. ప్రధాని మోదీతో సమావేశం అనంతరం అమిత్‌ షా నివాసానికెళ్లి.. ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల వెలువడిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్‌ జగన్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కేంద్రంలో రెండోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన అమిత్‌ షాను జగన్‌ అభినందించారు.

30 నిమిషాల పాటు సాగిన ఇద్దరి మధ్య సమావేశంలో ఏపీ విభజన హామీలపై ప్రధానంగా చర్చ జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి కేం‍ద్రం నుంచి సహాయసహకారాలు అందించాలని అమిత్‌షాను కోరారు. కాగా అంతకుముందు ప్రధాని మోదీతో సమావేశమైన విషయం తెలిసిందే. కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తున్న మోదీ, షాతో భేటీలో రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన ఎజెండాగా సమావేశం జరిగింది. ఇదిలావుండగా.. మోదీ, షాలతో భేటీ అనంతరం వైఎస్ జగన్‌ ఆంధ్రభవన్‌కు బయలుదేరారు. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
అమిత్‌ షాతో వైఎస్‌ జగన్‌ సమావేశం

మరిన్ని వార్తలు