103వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

3 Mar, 2018 16:38 IST|Sakshi

సాక్షి, ఒంగోలు : ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 103వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. ఈమేరకు పాదయాత్ర షెడ్యూల్‌ను వైఎస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు. ఆదివారం ఉదయం వైఎస్‌ జగన్‌ నైట్‌ క్యాంపు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. తాళ్లూరు శివారు నుంచి రాజానగరం గిరిజన కాలనీ, కంకుపాడు, శ్రీరాంనగర్‌ కాలనీ, పార్వతీపురం క్రాస్‌, తిమ్మయ్యపాలెం మీదుగా అద్దంకి వరకు పాదయాత్ర కొనసాగిస్తారు. వైఎస్‌ జగన్‌ రాత్రి అక్కడే బస చేస్తారు.

ముగిసిన పాదయాత్ర : వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 102 రోజు ప్రజాసంకల్పయాత్రను ముగించారు. నేడు 12.3 కిలోమీటర్లు నడిచిన జననేత మొత్తం 1383.1 కిలోమీటర్లు నడిచారు. గాడిపర్తివారి పాలెం, కొర్రపాటివారి పాలెం క్రాస్‌, శివరాంపురం మీదుగా తాళ్లూరు వరకు పాదయాత్ర సాగింది.

మరిన్ని వార్తలు