194వ రోజు ప్రారంభమైన వైఎస్‌ జగన్‌ పాదయాత్ర

20 Jun, 2018 09:01 IST|Sakshi

సాక్షి, పి.గన్నవరం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్‌ జగన్‌ బుధవారం ఉదయం నాగుల్లంక శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి చాకలిపాలెం, తాటిపాక మఠం మీదుగా పొదలాడ చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. తమ కూతురికి నామకరణం చేయాలని దంపతులు జననేతను కోరారు. ఆ చిన్నారికి  విజయమ్మ అని  వైఎస్‌ జగన్‌ పేరు పెట్టారు. 


పాదయాత్ర  తిరిగి మధ్యాహ్నం 2.45కు ప్రారంభమౌతుంది. అనంతరం పాదయాత్ర రాజోలు వరకు కొనసాగుతుంది. రాజోలులో జరిగే బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ పాల్గొని ప్రజలనుద్దేశించి  ప్రసంగిస్తారు. రాజన్న బిడ్డ ఇప్పటి వరకు పాదయాత్రలో 2,389కిలోమీటర్లు నడిచారు. వైఎస్‌ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.

మరిన్ని వార్తలు