14వ రోజు ముగిసిన ప్రజాసంకల్పయాత్ర

21 Nov, 2017 21:39 IST|Sakshi

సాక్షి, బేతంచర్ల (కర్నూలు జిల్లా): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 14వ రోజు కోలుములపల్లెకు చేరుకోగానే ముగిసింది. డోన్‌ నియోజకవర్గం బేతంచర్ల మండలం గోరుగుట్ల నుంచి కోలుములపల్లె వరకు మంగళవారం 13.4 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. మంగళవారం ఉదయం 8 గంటలకు బేతంచర్ల మండలం గోరుగుట్ల నుంచి వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. జననేత జగన్‌కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఉదయం 9 గంటలకు షైక్‌షావలీ దర్గాను చేరుకొని డోన్‌ నియోజకవర్గం పార్టీ నేతలతో ఆయన ముచ్చటించారు.

ఉదయం 10 గంటలకు పాణ్యం నేతలతో సమావేశమై స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం గురించి చర్చించారు. మధ్యాహ్నం 12: 30 గంటలకు వైఎస్‌ జగన్‌ భోజన విరామం తీసుకున్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా అభిమానులు, మద్ధతుదారులు ప్రియతమ నేత వైఎస్ జగన్ వెంట నేనుసైతం అంటూ పాదయాత్రలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు బేతంచర్ల నుంచి పాదయాత్ర కొనసాగించిన వైఎస్ జగన్ బేతంచర్ల బస్టాండ్‌ సర్కిల్‌ లో నిర్వహించిన బహిరంగ పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు కోలుములపల్లే చేరుకుని పార్టీ జెండాను ఆవిష్కరించారు. రాత్రి 7.30 గంటలకు వైఎస్‌ జగన్‌ బస చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 14 రోజుల పాటు చేసిన పాదయాత్రలో వైఎస్ జగన్ ఇప్పటివరకూ 196.2 కిలోమీటర్లు నడిచారు. 15వ రోజు (బుధవారం) ఉదయం 8 గంటలకు డోన్‌ నియోజకవర్గం బేతంచర్ల మండలం కోలుములపల్లి నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగించనున్నారు.

మరిన్ని వార్తలు