అడుగడుగునా అన్యాయం.. అబద్ధాలు: వైఎస్‌ జగన్‌

18 Mar, 2019 18:06 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌: ఐదేళ్ల చంద్రబాబు నాయుడు పాలనతో విసిగిపోయిన ప్రతి పేదవాడికి అండగా తాను ఉన్నానని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. తన 3648 కి.మీటర్ల పాదయాత్రలో ప్రతి పేదవాడి గుండెచప్పుడు విన్నానని, వారి సమస్యలను దగ్గరుండి చూశానని వైఎస్‌ జగన్‌ తెలిపారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అడుగడుగునా అన్యాయం, అబద్ధాలతో ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ జిల్లా రాయచోటి నియోజకవర్గంలో సోమవారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్‌ మాట్లాడారు. ప్రభుత్వానికి మంచి మనసుంటే ప్రతి ఇంటికీ మంచిచేయాలని కోరుకుంటుందని, టీడీపీ ప్రభుత్వానికి మాత్రం అదిలేదని మండిపడ్డారు. పేదవాడు సంతోషంగా బతకడానికి ఏం కావాలో తన పాదయాత్రలో తెలుసుకున్నానని, తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాటన్నింటిని అందిస్తానని హామీ ఇచ్చారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్‌సీపీ రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి గడికోట శ్రీకాంత్‌రెడ్డిని, రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్‌ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైఎస్‌ జగన్‌ కోరారు.
‘అన్నకు అవకాశం ఇద్దాం.. సీఎం చేద్దాం’
వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థుల ప్రొఫైల్స్‌

చంద్రబాబు నాయుడు పాలనలో అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చే మూడువేలు తీసుకుని మరోసారి మోసపోద్దని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మహిళలు, రైతులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పాదయాత్రలో చూశాను. వాటిని చూసి చలించిపోయాను. చంద్రబాబు పాలనలో మోసపోయిన ప్రతి పేదవాడి  సమస్యలను నేను విన్నాను, చూశాను. వారందరికీ మాట ఇస్తున్న మీకు అండగా నేనున్నాను. గత ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తానని, పొదుపు రుణాలు మాఫీ చేస్తానని, ఉద్యోగాలు ఇస్తామని ఇలా అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. మద్యపానం పూర్తిగా నిషేధిస్తామని హామీ ఇచ్చి.. దానిని విస్మరించి.. ప్రతి గ్రామంలో బెల్ట్‌ షాపులను తెరిపించారు. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నాలుగు విడతల్లో మద్యపానం పూర్తిగా నిషేధిస్తాం. చదవుకున్న వారికి ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు. ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతికూడా ఇవ్వలేదు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డాం. చంద్రబాబు దానిని కూడా తాకట్టుపెట్టారు.  కడప స్టీల్‌ ఫ్యాక్టరీ నిర్మిస్తే స్థానిక యువతకు ఉద్యోగాలు లభించేవి. టీడీపీ ప్రభుత్వం దానిని కూడా విస్మరించింది.
రాబోయే 20 రోజుల్లో జరగబోయేది ఇదే : వైఎస్ జగన్


ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు నాయుడు ఏమైనా చేస్తాడు. మూటలతో కోట్లు తెస్తాడు. మన పార్టీకి చెందిన వారి ఓట్లను తొలగిస్తాడు. అవసరమయితే దొంగ ఓట్లు చేరుస్తాడు. తెగించి హత్యలు కూడా చేయిస్తాడు. ప్రజల సమాచారం కూడా చోరీచేస్తాడు. న్యాయానికి, అన్యాయానికి మధ్యం మధ్య యుద్ధం జరుగుతోంది. ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. వైఎస్సార్‌ పాలన కంటే గొప్ప పరిపాలనను అందిస్తా. మళ్లీ రాజన్న రాజ్యాన్ని నిర్మిస్తాం. మరో 20 రోజులు ఒపిక పట్టండి. మన ప్రభుత్వం ఏర్పడుతుంది. చదువుకు దూరమైన ప్రతి పిల్లవాడిని చదవిస్తాం. పిల్లల్ని బడికి పంపిన ప్రతి తల్లికి ఏడాదికి 15000 అందిస్తాం. డ్వాక్రా సంఘాలను ఆదుకుంటాం. నవరత్నాలు ప్రతి ఒక్కరికి అందేలా పరిపాలన అందిస్తాం. ఈ ప్రాంతానికి చెందిన మైనార్టీ వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని గతంలో రాయచోటికి వచ్చిన సందర్భంగా మాట ఇచ్చాను. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన హామీని నెరవేరుస్తాం’’ అని తెలిపారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా