చంద్రబాబు సినిమా చూపిస్తున్నారు: వైఎస్‌ జగన్

30 May, 2018 18:18 IST|Sakshi

సాక్షి, నరసాపురం : ‘టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారు. రాజధాని మాదిరిగానే అదిగో ..వశిష్ట వారధి...ఇదిగో వశిష్ట వారధి అంటూ నరసాపురం ప్రజలకు సినిమా చూపిస్తున్నారు. ప్రతి ఎన్నికలప్పుడు చంద్రబాబుకు వశిష్ట వారధి గుర్తుకు వస్తుంది. వశిష్ట వారధి నిర్మిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి మరిచిపోయారు. మత్స్యకారులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. వేట విరామ సమయంలో రూ.4వేలు కూడా చంద్రబాబు ఇవ్వలేదు. అలాగే బియ్యప్పుతిప్ప హార్బర్‌ను పక్కనపెట్టారు.

ఇక చంద్రబాబు సీఎం అయిన తర్వాత కొత్త బోట్లకు రిజిస్ట్రేషన్‌ ఆపేశారు. డీజిల్‌కు రాయితీ ఇవ్వాల్సి ఉంటుందని కొత్త బోట్లకు రిజిస్ట్రేషన్‌ ఇవ్వడం లేదు. అధికారంలోకి వచ్చాకా మత్స్యకారులకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. గతంలో మత్స్యకారులు చనిపోతే వెంటనే డబ్బులు వచ్చేవి. ఇప్పుడు వారు చనిపోతే డబ్బులు రావడం లేదు.’  అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని స్టీమర్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.

మత్య్సకారులకు కార్పొరేషన్‌ ఏర్పాటు
‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే మత్స్యకారులకు కొత్త బోట్లు ఇస్తాం. అంతేకాకుండా వేట విరామ సమయంలో వారికి నెలకు రూ.10వేలు,  మత్స్యకారులు ప్రమాదవశాత్తూ చనిపోతే బీమా కింద పది లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తాం. మత్స్యకారులకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాంర. అలాగే బోట్లపై డీజిల్‌కు సబ్సిడీ ఇస్తాం.’ అని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.

చెప్పనవి కూడా చంద్రబాబు చేశారట..!
చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో 98 శాతం హామీలు అమలు చేశారట. చెప్పనవి కూడా చంద్రబాబు చేశారట. రైతుల రుణాలను మాఫీ చేశారట. బాబు రుణమాఫీ వడ్డీలకైనా సరిపోతుందా?. పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ అయిందా?. బీసీలు జడ్జిలు కాకుండా చంద్రబాబు లేఖలు రాస్తారు. జస్టిస్‌ ఈశ్వరయ్య చంద్రబాబు లేఖను చూపించారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 12 మంత్రి పదవులు ఇస్తానన్న చంద్రబాబు ఏపీలో మాత్రం ఒక‍్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు.

ఆరోగ్యశ్రీని పునరుద్దరిస్తాం
వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం రాగానే నవరత్నాలు పథకాన్ని తీసుకు వస్తాం. నవరత్నాలతో అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపుతాం. పేదవాడి కోసం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకం తీసుకువస్తే దాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేశారు. మనం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీని పునరుద్దరిస్తాం. రూ.వెయ్యి బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తాం. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు ఎక్కడైనా సరే ఆపరేషన్‌ చేయించుకుంటే ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొస్తాం. కుటుంబ పెద్ద ఆపరేషన్‌ చేయించుకున్నా విశ్రాంతి అవసరం అయితే ఆ సమయంలో పేషెంట్‌కు ఆర్థిక సాయం చేస్తాం. డయాలసిస్‌, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేల పింఛన్‌ ఇస్తాం. అవ్వా తాతలకు రూ.2వేల పెన్షన్‌, అంతేకాక వారి పెన్షన్‌ వయస్సును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45ఏళ్లకే పెన్షన్‌ ఇస్తాం.

వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమి మాట్లాడారంటే...

  • చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు
  • రైతులు గిట్టుబాటు ధర లేక చనిపోతున్నారు
  • ఒక్క పంటకైన సీఎం చంద్రబాబు పాలనలో గిట్టుబాటు ధర పలికిందా?
  • నరసాపురంలో 4వేల ఎకరాల్లో ఉప్పుపంట సాగవుతుంది
  • ఉప్పు రైతులకు గిట్టుబాటు ధరల్లేవు, గిడ్డంగులు లేవు
  • ఉప్పు బస్తాను దళారీలు కేజీ రూ.1.70 పైసలకు కొంటున్నారు
  • అదే ఉప్పును అదే ఉప్పును ప్యాకింగ్‌ చేసి హెరిటేజ్‌లో కేజీ రూ.10కి అమ్ముతున్నారు
  • నరసాపురంలో చేతి అల్లికలు మీద 15వేలమంది మహిళలు ఆధారపడి జీవిస్తున్నారు
  • వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో చేతి అల్లికల మహిళకు పెద్ద పీట వేశారు.
  • చేతి అల్లిక మహిళలకు నెలకు రెండు వేలు సబ్సిడీ కింద ఇస్తాం
మరిన్ని వార్తలు