తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలి : వైఎస్‌ జగన్‌

11 Oct, 2018 21:25 IST|Sakshi

సాక్షి, విజయనగరం : తుపాను ప్రభావంతో ఇప్పటివరకు 8 మంది చనిపోయారనీ, తీవ్ర ఆస్తి, పంట నష్టాలు కూడా సంభవించాయనీ ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి బాధితులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

ధర్మాన నేతృత్వంలో తిత్లీ నష్టంపై కమిటీ

తిత్లీ తుపాను వల్ల దెబ్బతిన్న శ్రీకాకుళం జిల్లాలో ఆస్తి నష్టాన్ని అంచనా వేసేందుకు, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పార్టీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో కమిటీని నియమించారు.  భూమన కరుణాకర రెడ్డి, తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్‌, పాలకొండ ఎమ్మెల్యే కళావతి, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, రెడ్డి శాంతి, పార్టీ జిల్లా వ్యవసాయ విభాగం అధ్యక్షుడు రఘురామ్‌ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ కమిటీ శుక్రవారం నుంచి బాధిత ప్రాంతాల్లో పర్యటించి జరిగిన నష్టాన్ని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి నివేదిస్తుందని పత్రికా ప్రకటనను జారీ చేశారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తిప్పేస్వామి

అది కేవలం స్టాలిన్‌ అభిప్రాయం : అఖిలేష్‌

325వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

కాంగ్రెస్‌ నేత సజ్జన్‌కుమార్‌ రాజీనామా

స్కూల్‌ పిల్లల కన్నా దారుణం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాడీ పోరాట కళా శిక్షణలో కాజల్‌

రాజకీయం లేదు

కనిపించదు... వినిపించదు!

వైఎస్‌ జగన్‌ గారంటే నాకు ప్రాణం!

అందుకే సక్సెస్‌ మీట్‌  

ప్చ్‌..  మళ్లీ నిరాశే