96వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌ విడుదల

23 Feb, 2018 15:17 IST|Sakshi

సాక్షి, ఒంగోలు : ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 96వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. ఈమేరకు పాదయాత్ర షెడ్యూల్‌ను వైఎస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు. శనివారం ఉదయం వైఎస్‌ జగన్‌ నైట్‌ క్యాంపు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. కాంతంవారి పల్లి క్రాస్‌, చిన్న ఎర్లపాడు క్రాస్‌, పేరంగుంట కొత్తపల్లి క్రాస్‌, చింతళ పాలెం చేరుకుంటారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అక్కడ నుంచి మద్యాహ్నం 12 గంటలకు శంఖవరం చేరుకొని, భోజన విరామం​ తీసుకుంటారు.

అనంతరం మద్యాహ్నం 2.45 గంటలకు తిరిగి పాదయాత్ర  ప్రారంభిస్తారు. మూడు గంటలకు కనిగిరి పట్టణం చేరుకొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆతరువాత సాయంత్రం 5గంటలకు టకారిపాలెం చేరుకొని ప్రజలతో మమేకం అవుతారు. సాయంత్రం 5.30 గంటలకు పాదయాత్రను ముగించి రాత్రికి అక్కడే బస చేస్తారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు