258వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

8 Sep, 2018 20:32 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 258వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం వైఎస్‌ జగన్‌  విశాఖపట్నం నియోజకవర్గంలోని నైట్‌ క్యాంప్‌ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి గోపులపట్నం, మెయిన్‌ రోడ్డు, జంక్షన్, ఎన్‌ఏడీ జంక్షన్ మీదుగా ఓల్డు కరస వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ వైఎస్‌ జగన్‌  భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది.

అనంతరం మరీపాళ్ళెం  మీదుగా పశ్చిమ విశాఖ, ఉత్తర విశాఖపట్నం, మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. అనంతరం పశ్చిమ విశాఖనపట్నం నియోజకవర్గం కంచెర్లపాళ్ళెంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. అనంతరం అక్కడ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తర్వాత  ఉత్తర విశాఖ, తాటి చెట్లపాళెకళ్ళెం మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. ఆయన అక్కడే రాత్రి బస చేయనున్నారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

రేపు జరిగే బహిరంగ సభ చరిత్ర సృష్టిస్తుంది.. 
వైఎస్పార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు  విజయ సాయి రెడ్డి శనివారం మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ... రేపు మధ్యహ్నం 3:00 గంటలకు జరిగే బహిరంగ సభ చరిత్రలో నిలిచే విధంగా నిలిచిపోతుందని ఆయన తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే గతంలో ప్రకటించిన విధంగా నవరత్నాలను అమలు చేస్తామని ఆయన తెలిపారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ ఇంత వరకూ ప్రకటించని విధంగా ప్రజా మ్యానిఫెస్టోను రూపొందిస్తామని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర నవంబర్‌ నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉందని.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ విజయవంతంగా పాదయాత్ర కొనసాగుతుందని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు