240వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

18 Aug, 2018 21:49 IST|Sakshi

సాక్షి, నర్సీపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 240వ రోజు షెడ్యూలు ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నర్సీపట్నం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. సుబ్బరాయుడు పాలెం, చంద్రయ్య పాలెం, వజ్రగడ క్రాస్‌, తమ్మయ్య పాలెం వరకు పాతయాత్ర కొనసాగుతుంది. అక్కడ వైఎస్‌ జగన్‌ లంచ్‌ విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో పాదయాత్ర పునః ప్రారంభమవుతుంది. జోగివాని క్రాస్‌ మీదుగా ధర్మసాగరం క్రాస్‌ వరకు పాదయాత్ర కొనసాతుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. 

ముగిసిన పాదయాత్ర:  వైఎస్‌ జగన్‌ 239వ రోజు పాదయాత్ర నర్సీపట్నంలో ముగిసింది. నేడు ఆయన నర్సీపట్నం నియోజకవర్గంలోని బెన్నవరం, కృష్ణపురం, దుగ్గడక్రాస్‌, బయ్యపురెడ్డిపాలెం, బలిఘట్టం మీదుగా నర్సీపట్నం వరకు 12.7 కిలోమీటర్లు నడిచారు. దీంతో జననేత ఇప్పటివరకు 2,746.8 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తిచేసుకున్నారు.

 

మరిన్ని వార్తలు