వైఎస్‌ జగన్‌ 136వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌

13 Apr, 2018 20:43 IST|Sakshi

సాక్షి, విజయవాడ: వైఎ​స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతుంది. రేపటి(శనివారం) నుంచి ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగనుంది. కనకదుర్గ వారధి వద్ద యాత్ర కృష్ణా జిల్లాలోకి ప్రవేశించనుంది. జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 270 కిలోమీటర్ల మేర వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తారని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. 136వ రోజు యాత్ర షెడ్యూల్‌ను ఆయన మీడియాకు విడుదల చేశారు.

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి నుంచి శనివారం ఉదయం 136వ రోజు పాదయాత్రను వైఎస్‌ జగన్‌ కొనసాగిస్తారు. కనకదుర్గ వారధి గుండా కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తారు. ఫ్లైఓవర్‌ బ్రిడ్జి, వెటర్నరీ ఆస్పత్రి సెంటర్‌, శిఖామణి సెంటర్‌, పుష్పా హోటల్‌ సెంటర్‌, సీతారాంపురం సెంటర్‌ మీదుగా కొత్తవంతెనకు చేరుకుంటారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం బీఆర్‌టీఎస్‌ రోడ్డు, మీసాల రాజారావు రోడ్డు, ఎర్రకట్ట మీదుగా చిట్టినగర్‌కు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. చిట్టినగర్‌ సెంటర్‌లో జరిగే బహిరంగం సభలో జననేత పాల్గొంటారు. చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్‌ వద్ద యాత్ర ముగిస్తారు.

మరిన్ని వార్తలు