అలుపెరుగని బాటసారి @ 3000 కి.మీ

24 Sep, 2018 13:35 IST|Sakshi

సాక్షి, విజయనగరం: కష్టాల సుడిగుండంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు నేనున్నాంటూ భరోసా ఇవ్వడానికి ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించిన ప్రజాసంకల్పయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. గతేడాది నవంబర్‌ 6న ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర నేడు 3000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది. చంద్రబాబు అవినీతిని ఎలుగెత్తి చాటుతూ.. పేదల ఉసురు పోసుకుంటున్న విధానాలను తూర్పారాబడుతూ సాగిస్తున్న యాత్రకు 11 జిల్లాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

జననేత జనం కోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో సోమవారం మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. విజయనగరం జిల్లా, ఎస్‌కోట నియోజకవర్గం, కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాసంకల్పయాత్ర 3000 కిలోమీటర్ల పైలాన్‌ను జననేత వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. అదేవిధంగా ఈ మైలురాయికి గుర్తుగా రావి మొక్కను అక్కడ నాటారు. చారిత్రాక ఘట్టానికి సాక్షులుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆ రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. జననేత పాదయాత్ర 3000 కిలోమీటర్లు చేరుకున్నవేళ తెలుగు రాష్ట్రాలతోపాటు పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సంఘీభావ యాత్రలు కొనసాగాయి.

కిలోమీటర్ల వారిగా పాదయాత్ర ఘనతలు
0- వైఎస్‌ఆర్‌ జిల్లా, పులివెందుల నియోజకవర్గం ఇడుపుల పాయ 
500- అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు 
1000- నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం
1500- గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం ములుకుదురు 
2000- పశ్చిమ గోదావరి జిల్లా మాదేపల్లి
2500- తూర్పు గోదావరి జిల్లా పసలపూడి శివారు 
3000- విజయనగరం జిల్లా దేశపాత్రునిపాలెం 

మరిన్ని వార్తలు