కాపు, క్షత్రీయ వర్గాలకు పెద్దపీట

17 Mar, 2019 13:13 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా : అభ్యర్థుల ప్రకటన విషయంలో అన్నిసామాజిక వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా చేశారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థులను ప్రకటించారు. పాదయాత్రలో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేసిన బీసీ ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రాజమండ్రి లోక్‌సభ స్థానాన్ని బీసీలకు కేటాయిస్తానని గతంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే రాజమండ్రి స్థానాన్ని బీసీ సామాజిక వర్గానికి చెందిన మంగన భరత్‌ కేటాయించారు. అలాగే జిల్లాలోని అసెంబ్ అభ్యర్థుల ప్రకటనలో కాపు, క్షత్రియ సామాజిక వర్గాలకు పెద్దపీట వేశారు. జిల్లాలో ఆరు అసెంబ్లీ స్థానాలను కాపు సామాజిక వర్గానికి, మూడు స్థానాలతో పాటు  నరసాపురం లోక్‌సభ స్థానాన్ని క్షత్రియ సామాజిక వర్గానికి కేటాయించారు. కమ్మ, బీసీ సామాజిక వర్గాలకు ఒక్కో అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ ఆరంభం నుంచి తన వెంటే ఉన్న ముదునూరి ప్రసాద రాజు, తెల్లం బాలరాజులకి మరోసారి అవకాశం కల్పించారు. 

ఇక జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ఇప్పటి వరకు 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటి వరకు చంద్రబాబు ప్రటించిన అభ్యర్థులలో సొంత సామాజిక వర్గానికే పెద్దపీట వేశారు. పశ్చిమలో 4 సీట్లను కమ్మ సామాజిక వర్గానికి కేటాయించిన టీడీపీ.. నిడదవోలు అసెంబ్లీ స్థానానికి కూడా అదే వర్గానికి చెందిన బూరుగుపల్లి బ్రదర్స్‌  పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమలో అధిక ప్రభావమున్న క్షత్రియులపై చంద్రబాబు చిన్న చూపు చూశారు. ఆ వర్గానికి కేవలం ఒక్క సీటు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు. బీసీలకు సైతం మొండిచేయి చూపారు. కేవలం ఒక్క సీటును మాత్రమే ఆ వర్గానికి కేటాయించారు. కాపులకు మూడు స్థానాలను మాత్రమే కేటాయించిన టీడీపీ.. నరసాపురం సీటును అదే వర్గానికి కేటాయించే అవకాశం ఉంది.

పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 
కొవ్వురు(ఎస్సీ) - తానేటి వనిత
నిడదవోలు - జి. శ్రీనివాస నాయుడు
ఆచంట - చెరుకువాడ శ్రీరంగనాథరాజు
పాలకొల్లు - డాక్టర్‌ బాబ్జీ
నరసాపురం - ముదునురి ప్రసాద్‌ రాజు
భీమవరం - గ్రంథి శ్రీనివాస్‌
ఉండి - పీవీఎల్‌ నరసింహరాజు
తణుకు - కరుమురి వెంకట నాగేశ్వరరావు
తాడేపల్లిగూడెం - కొట్టు సత్యనారాయణ
ఉంగుటురు - పుప్పాల శ్రీనివాసరావు
దెందులురు - కొఠారు అబ్బాయి చౌదరి
ఏలురు - కృష్ణ శ్రీనివాసరావు
గోపాలపురం(ఎస్సీ) - తలారి వెంకట్రావు
పోలవరం(ఎస్టీ) - తెల్లం బాలరాజు
చింతపుడి(ఎస్సీ) - వి.ఆర్‌.ఇలియజ్‌

మరిన్ని వార్తలు