ఆ రూ. 3లక్షలు మాఫీ చేస్తాం: వైఎస్‌ జగన్‌

28 Mar, 2019 12:17 IST|Sakshi

సాక్షి, పాలకొల్లు: లంచాలు తీసుకునేది చంద్రబాబు అయితే వాటిని పేదవారు చెల్లించాలా అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంకులపాడులో చంద్రబాబు కడుతున్న ఫ్లాటు తీసుకున్న వారిపై 3 లక్షల రూపాయల అదనపు భారాన్ని మోపడంపై ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే ఆ మొత్తాన్ని తామే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని పాలకొల్లులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా తన కోసం వచ్చిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మీరు చెప్పిన కష్టాలన్నీ గుర్తున్నాయి..
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘నా సుదీర్ఘ పాదయాత్ర పాలకొల్లు గుండా సాగినప్పుడు మీరు చెప్పిన కష్టాలు విన్నాను. అవి ఈ రోజుకు కూడా నాకు గుర్తున్నాయి. పక్కనే గోదావరి ఉన్న రెండో పంటకు నీరందని పరిస్థితి. ఎంతో కొంత పంట పండిస్తే గిట్టుబాటు ధర ఉండదు. క్వింటాలుకు 1200 రూపాయలు కూడా రావడం లేదని మీరు చెప్పిన సమస్యలు నాకు గుర్తున్నాయి. పొగాకు ధర రోజురోజుకు పడిపోతుందన్న మీ ఆవేదన గుర్తుంది. పామయిల్‌ పంటకు నేను ధర్నా చేస్తే కానీ గిట్టుబాటు ధర రాని పరిస్థితి. అక్రమాలను, అవినీతిని అడ్డుకున్న ప్రభుత్వ ఉద్యోగులను అధికార పార్టీ నేతలు జట్టు పట్టుకుని లాక్కేళ్లిన పరిస్థితి ఇక్కడ ఉందని మీరు చెప్పారు. లేసు, అల్లికలు చేస్తున్నా అక్కాచెల్లమ్మలు ప్రభుత్వం నుంచి ప్రోత్సహం రాక పడుతున్న బాధలు గుర్తున్నాయి. 

ఆ మూడు లక్షలు చెల్లిస్తాం
పెంకులపాడులో చంద్రబాబు నాయుడు కడుతున్న అవినీతి ఫ్లాట్ల గురించి కూడా మీరు నాతో చెప్పారు. వాస్తవానికి ఈ స్థలాన్ని పేదవారికి ఇచ్చేందుకు నాన్నగారు దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కొనుగోలు చేశారు. 3లక్షల రూపాయల కూడా దాటని ఫ్లాట్లను చంద్రబాబు పేదలకు 6లక్షలకు అమ్ముతున్నారు. అందులో లక్షన్నర రాష్ట్ర ప్రభుత్వం, లక్షన్నర కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగిలిన 3లక్షల రూపాయలను అప్పుగా రాసుకుంటున్నారు. ఆ మొత్తాన్ని పేదవారు 20 ఏళ్ల పాటు నెలకు మూడు వేల రూపాయల చొప్పున కట్టాలని అంటున్నారు.  లంచాలు తీసుకునేది చంద్రబాబు అయితే.. ఆ మొత్తాన్ని పేదవారు చెల్లించాలా?. చంద్రబాబు ఇచ్చిన ఫ్లాటులను తీసుకున్న వారికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఈ 3లక్షల రూపాయలను మాఫీ చేస్తాం. ఊరి మధ్యలో డంపింగ్‌ యార్డ్‌తో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నా పట్టించుకునే నాథుడు ఉండరు.

యువతకు నేనున్నా..
50 పడకల ఆస్పత్రిని 100 పడకలుగా మారుస్తామని చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారు. ఇప్పటికీ చంద్రబాబు ఆ హామీని నేరవేర్చరా?. శ్మశానాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పి వాటిలో కూడా కమీషన్‌లు దండుకునే అభివృద్ధి ఇక్కడ జరుగుతుంది. రుణామాఫీ జరగక డ్వాక్రా మహిళలు పడే ఇబ్బందులు చూశా. ఉద్యోగాలు రాక కోచింగ్‌ సెంటర్‌లలో విద్యార్థులు పడుతున్న బాధలు చూశా. పక్క రాష్ట్రాలకు వలసల పోతున్న దుస్థితి. లక్షా 42 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు కమల్‌నాథన్‌ కమిటీ చెప్పినా.. కానీ ఉద్యోగాల భర్తీ జరగదు. ప్రత్యేక హోదా వస్తే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, జీఎస్టీలు కట్టాల్సిన అవసరం లేదు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని, తమ బతుకులు బాగుపడతాయని భావించిన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం వెన్నుపోటు పోడిచింది. యువకులందరికీ నేనున్నానని భరోసా ఇస్తున్నాను.

చంద్రబాబు పార్టనర్‌ దీనిని అంగీకరిస్తారా?
పదేళ్లపాటు నన్ను రాజకీయాల్లో చూశారు. ఎవరికీ ఏ కష్టం వచ్చినా వైఎస్‌ జగన్‌ అక్కడ ఉన్నాడు. కానీ జగన్‌కు కలిగిన ప్రతి కష్టం చంద్రబాబు నాయుడుకు, ఎల్లో మీడియాకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. చివరకు మా చిన్నాన్న వివేకానందరెడ్డి హత్యను కూడా పండగ చేసుకున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడుకు పార్టనర్‌.. ఓ యాక్టర్‌ ఉన్నారు. ఆయన కూడా చంద్రబాబు నాయుడు కుట్రలో భాగమై విలువలు మరచిపోయి మాట్లాడుతున్నారు. మా చిన్నాన్నను హత్య విషయంలో ఆ యాక్టర్‌ కూడా చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరి కుటుంబం బాగుండాలని నేను కోరుకుంటాను. చంద్రబాబు పార్టనర్‌ను నేను ఓ విషయం అడుగుతున్నా.. మీ కుటుంబంలో ఎవరినైనా బాబు గారి మనుషులు చంపించి.. వాళ్ల పోలీసులు చేత విచారణ చేపిస్తూ.. వాళ్ల మీడియాతో వక్రీకరించి.. అది మీ బంధువులే చేయించారంటే మీరు అంగీకరిస్తారా?. చంద్రబాబు చేసిన అన్యాయాన్ని గమనించాలి.

చంద్రబాబు అవినీతిలో మీకు భాగం లేదా?
2014లో చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయమని ఈ పార్టనర్‌ చెప్పారు. నాలుగు ఏళ్లపాటు ఆయన చంద్రబాబుతో కలిసే ఉన్నారు. ఈ కాలంలో చంద్రబాబు నాయుడు పాల్పడ్డ అవినీతి, అక్రమాలలో ఆయనకు భాగం లేదా?. నాలుగేళ్లపాటు కలిసి కాపురం చేసి.. ఎన్నికలకు ఏడాదికి ముందే విడిపోయినట్టు నాటకం ఆడుతారు. పార్టనర్‌ గారు నామినేషన్‌ వేయడానికి వెళ్తే అక్కడ కనిపించేవి టీడీపీ జెండాలు ఐదేళ్లు పాలన చేసిన చంద్రబాబు మోసాలపై, అన్యాయాలపై, అక్రమాలపై పార్టనర్‌ మాట్లాడరు. ఎప్పుడూ మాట్లాడిన జగన్‌.. జగన్‌.. అంటూ ఉంటారు. ఈ కుట్రలను గమనించమని ప్రజలను కోరుతున్నా. రానున్న రోజుల్లో ఈ కుట్రలు ఇంకా పెరుగుతాయి. ప్రతి ఊరికి మూటలు, మూటలు డబ్బులు తీసుకోస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాలి.

ఇరవై రోజులు ఓపిక పట్టమని చెప్పండి
చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండని గ్రామాల్లోని అక్కాచెల్లమ్మలకు, అవ్వ తాతలకు చెప్పండి. ఇరవై రోజులు ఓపిక పట్టమని చెప్పండి. జగనన్న చెప్పకపోయి ఉంటే పించన్‌ రెండు వేలకు పెరిగేదా అని గుర్తుచేయండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఏ చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి.  గతంలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు వచ్చేవి. ఇప్పుడు అది కనిపించని పరిస్థితి. ఎన్నికల తేదీ వరకు ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా మీ చేతికే అందిస్తాం. అంతేకాకుండా మళ్లీ బ్యాంకుల వద్ద నుంచి సున్నా వడ్డీకే రుణాలు వస్తాయని చెప్పండి. మహిళలను లక్షాధికారులను చేయాలనే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్‌​ చేయూత కింద 75 వేల రూపాయలు నాలు దఫాలుగా చెల్లిస్తాం. చంద్రబాబు చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితి. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. నవరత్నాల గురించి ప్రతి అవ్వకు, తాతకు చెప్పిండి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ బాబ్జీని, ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు ఆశీర్వదించమ’ని కోరారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కుటుంబ కథా చిత్రం!

ఒక్కో ఓటుపై రూ.700

అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?

రెండు చోట్ల అందుకే ఓడిపోయా: పవన్‌

గడ్కరీ ఓడిపోతాడు.. ఆడియో క్లిప్‌ వైరల్‌!

సీఎంతో విభేదాలు.. కేబినెట్‌ భేటీకి డుమ్మా!

నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కొంటున్నారు

మాయ, అఖిలేష్‌ల ఫెయిల్యూర్‌ స్టోరీ

అంతా మీ వల్లే

బాబు వైఎస్సార్‌సీపీలోకి వెళితే నేను..

కేశినేని నాని కినుక వెనుక..

కొన్నిసార్లు అంతే.. !!

ఎంపీ కేశినేని నానితో గల్లా భేటీ

‘మాతో పెట్టుకుంటే పతనం తప్పదు’

టీడీపీకి ఎంపీ కేశినేని నాని షాక్‌!

చీఫ్‌ విప్‌గా మార్గాని భరత్‌ రామ్‌

‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయింది...

గిరిరాజ్‌కు అమిత్‌ షా వార్నింగ్‌

అఖిలేశ్‌ భార్యను కూడా గెలిపించుకోలేకపోయాడు!

యూపీలో కూటమికి బీటలు..?

జగన్‌ పాలనను.. చూస్తున్నారా చంద్రబాబూ?

సంఖ్యే ముఖ్యం... శాతం కాదు

గాంధీజీపై ఐఏఎస్‌ అధికారిణి వివాదాస్పద వ్యాఖ్య

బదులు తీర్చుకున్న నితీశ్‌

నితీశ్‌ కేబినెట్‌లోకి కొత్త మంత్రులు.. బీజేపీకి కౌంటర్‌!

మళ్లీ అదే జోడీ

‘త్రిభాష’పై తమిళ పార్టీల కన్నెర్ర

రక్షణ బాధ్యతల్లో రాజ్‌నాథ్‌