ఐదేళ్లుగా చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా?

1 Apr, 2019 13:16 IST|Sakshi

సాక్షి, విజయనగరం : ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఎన్నో వాగ్దానాలు చేస్తారని ఆయన మాటలు నమ్మి  మరోసారి అధికారం ఇస్తే... ఎన్నికల తర్వాత రాష్ట్ర  ప్రజలను పాతాళంలోకి నెట్టేస్తారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. 2014ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు 650 వాగ్ధానాలు చేసి ఒక్కటి కూడా నెరవేర్చకుండా.. మళ్లీ మోసం చేయడానికి వస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చే డబ్బులకు ఆశపడి మోస పోవద్దని ప్రజలను కోరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వర్గానికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఎస్‌.కోట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కె. శ్రీనివాస్‌, విశాఖ ఎంపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఆదరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారంవిజయనగరం జిల్లా ఎస్‌.కోట నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 


 
గుర్తించుకునే మూడు పనులు అయినా చేశారా? 
మండుతున్న ఎండల్లో కూడా చిక్కటి చిరునవ్వులతో అప్యాయతలను చూపిస్తూ ప్రేమానురాగాలు పంచుతున్నారు. మీ అందరీ ఆత్మీయతకు రెండు చేతులు జోడించి శిరస్సు వహించి నమస్కరిస్తూ..పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎస్‌.కోట నియోజకవర్గం గుండా 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. మీ కష్టాలు చూశాను. మీ బాధలు విన్నాను. మీ అందరికి చెబుతున్నా నేనున్నాను. ఐదేళ్ల చంద్రబాబు పాలన చూశారు. ఇదే నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ పుట్టిన తర్వాత ఒక్క 2004 తప్ప, మిగతా 30 ఏళ్ల పాటు తెలుగు దేశం పార్టీని ఇక్కడ గెలిపించారు. ఇంతగా టీడీపీని ఆశ్వీరదించిన ఈ నియోజకవర్గంలో ఈ 30 ఏళ్ల కాలంలో ప్రజలు గుర్తించుకునే మూడు పనులు అయినా జరిగాయా? ఒక్కసారి ఆలోచన చేయండి.

చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా?
ఇదే నియోజకవర్గంలోనే వి.కోట, కొత్త వలస, రేపాల మండలాలలో తీవ్రమైన కరువు ఉంది. రేపాల మండలానికి ఆనుకోనే రైవాడ రిజర్వాయర్‌ ఉన్నాసాగునీరు, సాగు నీరు రాదు. ఇదే రైవాడ నుంచి నిళ్లు విశాఖకు తరలించుకుపోతున్నారు. అక్కడి పరిశ్రమలకు ఈ నీళ్లు పోతున్నాయి. ఇక్కడ సాగు నీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా? ఇదే నియోజకవర్గంలోనే బాబు గారు వస్తే కర్మాగారాలు ఏరకంగా మూడపడ్డాయో ఆలోచించారు. ఈ ప్రాంతంలో భీమ్‌సింగి చక్కెర ఫ్యాక్టరీని 2003లో చంద్రబాబు ఏ రకంగా మూసేయించారో ఆలోచించాలి. మళ్లీ అదే చక్కెర ఫ్యాక్టరీని ప్రియతమ నాయకుడు వైఎస్సార్‌ తెరిపించారు. మళ్లీ చంద్రబాబు హయంలో రూ. 43కోట్ల అప్పుల్లోకి నెట్టేశారు.చెరకు రైతులకు గిట్టుబాటు ధర వస్తుందా? చెరుకు రైతులకు రూ.2600 కూడా గిట్టని పరిస్థితి ఇక్కడ ఉంటే ఇదే ఉత్తరప్రదేశ్‌లోరూ. 3150 పలుకుతుంది.

ఒక్క కొత్తపరిశ్రమ కూడా రాలేదు
విశాఖనగరానికి ఈ నియోజకవర్గం అతి సమీపంలో ఉన్నాకూడా ఈ ఐళ్లుగా ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదు. ఇదే జిల్లాలో జూట్‌ మిల్లులు మూతపడుతన్నాయి. జిల్లాలో ఉన్న ఫేరా పరిశ్రమలు చంద్రబాబు పెంచిన కరెంట్‌ రేట్లకు మూతపడుతున్నాయి. విభజన హామీలలో భాగంగా కొత్తవలస మండలంలో ఏర్పాటు కావాల్సిన గిరిజన యూనివర్సీటీ పనులు ప్రారంభం కూడా కాలేదు.

ఎస్‌.కోట నియోజకవర్గంలో జన సందోహం

చంద్రబాబు ఏప్రిల్‌పూల్‌ చేస్తూనే ఉన్నారు
2014లో ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు 650 వాగ్ధానాలు చేశారు. మళ్లీ 2019 ఏప్రిల్‌ వచ్చింది. మళ్లీ మోసం చేసేందుకు రెఢీగా ఉన్నారు. చంద్రబాబు పుట్టింది ఇదే ఏప్రిల్‌ మాసంలో పుట్టారు. అంటే నాల్గొ నెల 20వ తారీఖు. అంటే ఫోర్‌ట్వంటీ(420). ఇది చంద్రబాబు వ్యక్తిత్వానికి సరిపోయేలా ఉంది.  ఈరోజు ఏప్రిల్‌ ఒకటో తేది. అంటే పూల్స్‌డే. చిన్న పిల్లలు అబద్దాలు చెబుతూ ఆటపట్టించుకుంటారు. ఇవాళ చంద్రబాబు   ప్రజలను ప్రతి రోజు పూల్స్‌ చేస్తున్నారు. ఆయన పుట్టిన రోజు మహత్యమేమో కానీ పూల్‌ చేయడానికే చంద్రబాబు అలవాటు పడ్డాడు. చెప్పింది ఏది చేయరు. ఎన్నికల ముందు ఎన్నో వాగ్ధాలు చేస్తారు. ఎన్నికల తర్వాత పాతాళానికి నెట్టేస్తారు.

చేస్తానన్నది అభివృద్ధి చేసింది అవినీతి
గత ఎన్నిక సమయంలో వ్యవసాయ రుణాలు మాఫీ అన్నాడు. ఏమైంది? రూ. 87612 కోట్లు ఉంటే ఈ ఐదేళ్లలో వడ్డీలతో కలిపి రూ.1.5లక్షల కోట్లకు చేరాయి.డ్వాక్రా రుణాలు అన్ని కూడా మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు. ఏమైంది?  అక్షరాలు ఇవాళ రూ. 28వేల కోట్లరూపాయలకు ఎగబాకింది. నిరుద్యోగుల ఇంటికో ఉద్యోగం అన్నాడు ఏమైంది? ప్రతి యువకునికి లక్షా ఇరవైవేల రూపాయలకు బాకీ పడ్డారు. ప్రతి కూలానికి హామీ ఇచ్చారు. ఆహో ఓహో ఇవన్ని బాబు చేసేస్తున్నారని కొన్ని టీవీలు ఆకాశానికి ఎత్తేశాయి. చంద్రబాబు ఎన్నికల ప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో మాయం చేశారు. ప్రకటనలు మాయం చేశారు. ఐదేళ్ల తర్వాత చూస్తే బాబు మాటలు అన్నీ మాయలే. చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజున చేసిన ఐదు సంతకాలకు దిక్కుదివానా లేకుండా పోయింది. చేస్తానన్నది అభివృద్ధి చేసింది అవినీతి. దేశ చరిత్రలో ఇంతటి అవినీతి ఎవరూ చేయలేదు. సొంతకూతురిని ఇచ్చిన మామనే వెన్నుపోటు పొడినచిన చంద్రబాబు ఐదేళ్లుగా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తునే ఉన్నాడు. అటువంటి బాబును నమ్ముతారా? అలోచన చేయండి.

చంద్రబాబు ఇచ్చే మూడు వేలకు మోసపోవద్దు
ఎన్నికలు దగ్గరుకు వస్తే చంద్రబాబు రోజకో సినిమా చూపిస్తాడు. అధికారం కోసం దేనికైనా తెగిస్తాడు చంద్రబాబు. ప్రతి ఊరికి మూటలు, మూటలు డబ్బులు తీసుకోస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాలి. చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండని గ్రామాల్లోని అక్కాచెల్లమ్మలకు, అవ్వ తాతలకు చెప్పండి.

12రోజులు  ఓపిక పట్టమని చెప్పండి. జగనన్న చెప్పకపోయి ఉంటే పించన్‌ రెండు వేలకు పెరిగేదా అని గుర్తుచేయండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఏ చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్‌​ చేయూత కింద 75 వేల రూపాయలు నాలు దఫాలుగా చెల్లిస్తాం. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. నవరత్నాల గురించి ప్రతి అవ్వకు, తాతకు చెప్పిండి. ఎస్‌.కోట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కె. శ్రీనివాస్‌, ఎంపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణలపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కావాలి. వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీని ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు వేయండి. వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి’ అని వైఎస్ జగన్‌ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు