ఎన్నికల నగారా మోగించిన వైఎస్‌ జగన్‌

11 Mar, 2019 16:13 IST|Sakshi

సాక్షి, కాకినాడ: రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగిన వేళ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వేదికగా సోమవారం ఎన్నికల సమర శంఖారావం పూరించారు. తూర్పుగోదావరి జిల్లా నుంచే మార్పునకు నాంది పలుకుతూ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కాకినాడలో వైఎస్సార్‌సీపీ ఏర్పాటు చేసిన సమర శంఖారావ సభకు హాజరైన  అశేష జనసముహాన్ని ఉద్దేశించి జననేత వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. సమర శంఖారావం వేదికపై నుంచి వైఎస్‌ జగన్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆయన ఏమన్నారంటే..

  • రేపు వైఎస్సార్‌సీపీ 9వ ఆవిర్భావ దినోత్సవం
  • భారీగా తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ధన్యవాదాలు
  • తొమ్మిదేళ్లుగా మీరందరూ నాకు అండగా నిలిచారు
  • అధికార పార్టీ మిమ్మల్ని ఎంతగా బాధపెట్టిందో నాకు తెలుసు
  • మీకు తగిలిన ప్రతి గాయం నా గుండెకు తగిలింది
  • అధికారంలోకి రాగానే వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు ఎత్తివేస్తాం
  • అవినీతి లేని స్వచ్ఛమైన పాలన అందిస్తాం
  • దోపిడీకి పాల్పడ్డ టీడీపీకి శాంతియుతంగా సమాధి కట్టాలి
  • సంక్షేమ పథకాలు అమలు కావాలంటే రాజన్న రాజ్యం రావాలి
  • వైఎస్సార్‌సీపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి.
  • రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేశారు.
  • నిరుద్యోగ భృతి పేరుతో యువతను దగా చేశారు.
  • టీడీపీ అవినీతి పాలనపై, మేనిఫెస్టోలో ఇచ్చిన 600 మోసపూరిత హామీలపై ప్రతి కుటుంబంలో చర్చ జరగాలి
  • టీడీపీ ప్రభుత్వం ఇసుక నుంచి గుడి భూముల వరకు దేన్నీ వదలలేదు.
  • చివరకు మరుగుదొడ్ల నిర్మాణంలో కూడా అవినీతే చోటుచేసుకుంది.
  • చంద్రబాబు రాక్షస పాలనపై గ్రామాల్లో చర్చ జరగాలి

ఎల్లో మీడియాతో, లగడపాటి సర్వేలతో జాగ్రత్త

  • పోలవరం ప్రాజెక్టు పనులు పునాది గోడలు దాటి ముందుకు కదల్లేదు.
  • అమరావతి నిర్మాణంలో పిచ్చిమొక్కలు తప్ప ఏం కనబడటం లేదు.
  • పర్మినెంట్‌ పేరుతో ఒక్క ఇటుక పెట్టలేదు.. అంతా తాత్కాలికమే.
  • చంద్రబాబు ఓట్లను తొలగించే కార్యక్రమం చేస్తున్నారు.
  • ఈవీఎం ట్యాంపరింగ్‌ చేసిన వ్యక్తులను సలహాదారుడిగా పెట్టుకుంటారు.
  • ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేసిన మోసగాడు చంద్రబాబు.
  • చంద్రబాబుకు కొన్ని పత్రికలు, ఛానల్స్‌ వత్తాసు పలుకుతున్నాయి. 
  • తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం అంటూ లగడపాటి చెప్పారు.
  • లగడపాటి దొంగ సర్వేలపై, ఎల్లో మీడియా పట్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి.
  • చంద్రబాబు ప్రతి వ్యవస్థను నాశనం చేశారు
  • ఇంటెలిజెన్స్‌ అధికారులు చంద్రబాబుకు వాచ్‌మెన్‌లుగా పనిచేస్తున్నారు.

చంద్రబాబు సైబర్‌ క్రిమినల్‌..

  • ఐటీ గ్రిడ్స్‌ డేటా చోరిపై విస్తృతంగా చర్చ జరగాలి
  • ప్రజల డేటాను ప్రైవేటు సంస్థలు అప్పగించడానికి చంద్రబాబు ఎవరు?
  • ప్రజల వ్యక్తిగత డేటాను చోరీ చేసినందుకు టీడీపీని రద్దు చేయాలి
  • ఓటుకు కోట్ల కేసులో చంద్రబాబు రెండ్‌హ్యాండెడ్‌గా దొరికారు.
  • ఓట్ల తొలగింపులో కూడా చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు.

ఓటు భద్రంగా ఉందో తెలసుకోవాలి..

  • ప్రతి ఒక్కరు ఓటు భద్రంగా ఉందో లేదో మీరు తెలుసుకోవాలి.
  • ఒకవేళ ఓటు లేకపోతే వెంటనే నమోదు చేయించుకోవాలి.
  • ఓటర్‌​ ఐడీ కార్డు మీద ఎపిక్‌ నంబర్‌ను 1950కు ఎస్‌ఎంఎస్‌ చేస్తే మీ ఓటు ఉందో లేదో తెలుస్తుంది.
  • ఓటు లేని వాళ్లు ఫామ్‌-6 పూర్తి చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
  • ఇందుకోసం ఎమ్మార్వో ఆఫీస్, బుత్‌ లెవల్‌ అధికారిని గాని కలవాలి.
  • 2014 ఎన్నికల్లో టీడీపీ కూటమికి మనకు ఓట్ల తేడా కేవలం 5 లక్షలే.
  • అందుకే ప్రతి ఓటు కీలకమే.
  • రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు చేయని మోసం ఉండదు.
  • ఈ నెల రోజుల్లో మనం చాలా సినిమాలు చూస్తాం.
  • చంద్రబాబు చెప్పని అబ్బద్దం, చేయని మోసం, వేయని డ్రామా ఉండదు.. ఇవన్నీ మనకు ఎల్లో మీడియాలో కన్పిస్తాయి.
  • మనం యుద్ధం చేస్తుంది చంద్రబాబు ఒక్కరితోనే కాదు.. ఎల్లో మీడియాతో కూడా.

న్యాయం కోసం పోరాడితే కేసులు పెడుతున్నారు..

  • ఫామ్‌-7 అంటే దొంగ ఓటుపై ఇచ్చే ఒక దరఖాస్తు.
  • అలాంటి ఫామ్‌-7 మనవాళ్లు పెడితే బాబు అండ్‌ టీమ్‌ రివర్స్‌ అయింది.
  • న్యాయం కోసం పోరాడితే కేసులు పెడుతున్నారు.
  • నిజంగా ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా?

     

పేదవాడికి వైఎస్‌ జగన్‌ భరోసా..

  • చదువుకు, పేదరికానికి సంబంధం లేకుండా చేస్తా.
  • మీ పిల్లల చదువుకోసం.. ఎన్ని లక్షల ఖర్చైనా నేను చదివిస్తా.
  • చదువుకునేటప్పుడు పిల్లలు హాస్టల్‌లో ఉంటే.. ఏడాదికి 20వేల రూపాయలు ఇస్తాం.
  • చిన్న పిల్లలను స్కూలుకి పంపిన తల్లులకు ఏడాది 15వేల రూపాయలు అందజేస్తాం.
  • వైఎస్సార్‌ చేయూత కింద ప్రతి అక్కకు నాలుగు దఫాలుగా 75వేల రూపాయాలు.
  • ఎన్నికల నాటికి పొదుపు సంఘాల్లో ఉన్న రుణాలు నాలుగు దఫాల్లో మాఫీ
  • రైతు భరోసా కింద ప్రతి ఏడాది మే నెలలో ప్రతి రైతుకు రూ.12,500
  • పింఛన్‌ రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు పెంచుతాం.

వచ్చేది రాజన్న రాజ్యమని చెప్పండి..

  • నవరత్నాలతో ప్రతి మనిషి జీవితంలో వెలుగు చూస్తాం.
  • మన గుర్తు ఫ్యాన్‌ గుర్తు అని చెప్పండి.
  • వచ్చేది రాజన్న రాజ్యమని.. వచ్చేవి అన్నీ మంచి రోజులని చెప్పండి.

సీ-విజిల్‌ యాప్‌తో టీడీపీ అక్రమాలకు చెక్‌ చెప్పండి...

  • ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లో సీ-విజల్‌ యాప్‌ ఉంటుంది.
  • అందరు తమ తమ ఫోన్లలో సీ విజిల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.
  • టీడీపీ నేతలు ఎక్కడైనా అన్యాయం చేసినట్టుగా కనిపిస్తే.. ఈ యాప్‌ ద్వారా రికార్డ్‌ చేసి ఎన్నికల అధికారులకు పంపండి.
  • టీడీపీ అక్రమాలను అడ్డుకుని ప్రజల్లో చైతన్యం నింపండి.
  • టీడీపీ అక్రమాలపై ఈసీ చర్యలు తీసుకుంటుంది.
మరిన్ని వార్తలు