‘వరుణదేవుడి సాక్షిగా మరో 20 ఏళ్లు జగనే సీఎం’

26 Jun, 2019 21:38 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌జిల్లా : వరుణదేవుడు సాక్షిగా మరో ఇరవై ఏళ్లు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధిర్ రెడ్డి అన్నారు. సీఎం వైఎస్‌ జగన్ ప్రతిపక్షమే లేకుండా అత్యధిక స్థానాలు దక్కించుకోవడం, అలాగే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అఖండ మెజారిటీతో అదరించడం వల్ల  రాయలసీమ కులదేవుడైన వెంకన్న సన్నిధి వరకు పాదయాత్ర చేపట్టారాయన. మంగళవారం రాత్రి వైఎస్సార్ జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని కోనంపేటలోకి ప్రవేశించిన పాదయాత్ర బుధవారం రాత్రి రాయచోటి పట్టణం చేరుకోంది. ఈసందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు మాసాపేట లోని వేంపల్లి క్రాస్ వద్ద బాణసంచాలు కాల్చడంతో పాటు పూలమాలలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు.

(చదవండి : జగనన్న పాలన సజావుగా సాగాలంటూ.. ఎమ్మెల్యే పాదయాత్ర)

ఈ సందర్భంగా సాక్షి తో మాట్లాడిన ఆయన సీఎం వైఎస్‌ జగన్ పాలనలో కడప జిల్లాలోని జమ్మలమడుగు, రాయచోటి లకు సాగు, త్రాగు నీరు రావడంతో జిల్లా సస్యశామలం అవుతుందన్నారు. తాను పాదయాత్ర చేపట్టినప్పటి నుంచి వర్షం ఆగకుండా వస్తూనే వుందన్నారు. చంద్రబాబు పాలన పోయింనందుకు వానదేవుడు కరుణిస్తున్నాడని తెలిపారు. వేరుశనగ పంటకు 6.5 వేలు గిట్టుబాటు ధర కల్పించడం అలాగే గండికోట నిర్వాసితులకు పునారావసం క్రింద పది లక్షల ప్యాకేజి ప్రకటించడం ఆనందదాయకమని హర్షం వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్ పాలనలో రాష్ట్రం నేంబర్ వన్ స్థానానికి చేరడం ఖాయమన్నారు. రాయచోటి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో విడది చేసి సుండుపల్లి, వాయిలివడ్డు బిడికి మీదుగా పాదయాత్ర తిరుపతికి చేరుతుందన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా