తూర్పు, పశ్చిమలో వైఎస్సార్ సీపీదే హవా..

22 May, 2019 16:28 IST|Sakshi

సాక్షి, కాకినాడ: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల ఫలితాలు తమకు టెన్షన్‌ ఫ్రీ అని... ప్రజలు వైఎస్సార్ సీపీకే పట్టం కట్టారని గట్టిగా నమ్ముతున్నామన్నారు. ఉభయ గోదావరి జిల్లాలలో వైఎస్సార్ సీపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. అందుకే చంద్రబాబుకే తానూ.. తన కుమారుడు చేసిన అవినీతి మీద వైఎస్‌ జగన్‌ విచారణ జరిపిస్తారనే భయం పట్టుకుందన్నారు. 

కాగా కాకినాడ సిటీ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నడిచింది. వైఎస్సార్ సీపీ తరపున ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి, టీడీపీ నుంచి వనమాడి వెంకటేశ్వరరావు, జనసేన తరపున ముత్తా శశిధర్‌ మధ్య పోటీ సాగింది. నియోజకవర్గంలో 2,55,716 ఓట్లకుగాను 1,69,754 ఓట్లు పోలయ్యాయి. 66.38 శాతం పోలింగ్‌ నమోదు అయింది.

మరిన్ని వార్తలు