సీఈసీని కలిసిన వైఎస్సార్ సీపీ నేతలు

18 May, 2019 12:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీల బృందం శనివారం కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులను కలిశారు. కౌంటింగ్‌ ప్రక్రియ స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోకవర్గంలో రీ పోలింగ్‌ కట్టుదిట్టంగా, పారదర్శకంగా జరిపించాలని కోరారు. కౌంటింగ్‌ ప్రక్రియకు ఆటంకం కలిగించేందుకు టీడీపీ ప్రయత్నించే  అవకాశం ఉందని, చంద్రగిరి, ఉరవకొండ, మంగళగిరి, రాప్తాడు, దెందులూరు, ధర్మవరం, తాడిపత్రి, గాజువాక, రాజంపేట, చిలకలూరిపేట, వైజాగ్‌ ఈస్ట్‌, గుడివాడ, మైలవరం, గన్నవరం, తుని, భీమవరం తదితర అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించేందుకు కుట్ర పన్నుతోందని, సమస్యాత్మక నియోజకవర్గాల్లో అదనపు పోలీసు బలగాలను బయట రాష్ట్రాల నుంచి నియమించాలని, రాప్తాడు రిటర్నింగ్‌ అధికారిని మార‍్చాలని కోరారు.

మాక్‌ పోలింగ్‌లో పడిన వీవీ ప్యాట్‌ స్లిప్పులు తొలగించని పక్షంలో ఓట్ల లెక్కింపులో తేడా వచ్చే అవకాశం ఉందని, వీటిపై తగిన మార్గదర్శకాలను ఎన్నికల సంఘం వెలువరించాలని వైఎస్సార్ సీపీ నేతలు సీఈసీకి సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు. సీఈసీని కలిసినవారిలో పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, ఉమ్మారెడ్డి, వెంకటేశ్వర్లు, మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, బుట్టా రేణుక, పండుల రవీంద్రబాబు, అవంతి శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
సీఈసీని కలిసిన వైఎస్సార్ సీపీ నేతలు బృందం

 

>
మరిన్ని వార్తలు