విశాఖలో నేడు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర స్థాయి సమావేశం

11 Sep, 2018 03:26 IST|Sakshi
విశాఖ ఫంక్షన్‌ హాలులో వైఎస్సార్‌ సీపీ సమావేశ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి, కడప మేయర్‌ సురేశ్‌బాబు, ఎమ్మెల్యేలు రఘరామిరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, పార్టీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం తదితరులు

ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర స్థాయి సమావేశం విశాఖపట్నంలోని విశాఖ ఫంక్షన్‌ హాలులో మంగళవారం ఉదయం పదిగంటలకు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరుగుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం ఒక ప్రకటనలో తెలిపారు. చిన వాల్తేరు ఈస్ట్‌ పాయింట్‌ కాలనీ ప్రాంతాల్లో పాదయాత్ర అనంతరం జగన్‌ ఈ సమావేశానికి హాజరవుతారని పేర్కొన్నారు. పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు, రీజినల్‌ కో ఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు, పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. 

ఏర్పాట్ల పరిశీలన 
విశాఖ ఫంక్షన్‌ హాలులో వైఎస్సార్‌ సీపీ సమావేశ ఏర్పాట్లను సోమవారం పార్టీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్‌బి అంజద్‌బాషా, కడప మేయర్‌ కె.సురేశ్‌బాబు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పార్టీ బద్వేల్‌ సమన్వయకర్త డాక్టర్‌ వెంకటసుబ్బయ్య, పార్టీ నాయకులు రాచమల్లు రవిశంకర్‌రెడ్డి, పాకా సురేశ్‌కుమార్‌ పాల్గొన్నారు.  

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బీజేపీకి బిగ్‌ షాక్‌..!

‘ప్రధానిగా కొనసాగే అర్హత లేదు’

శివశివా.. ఇదేం ఇంటిపోరు!!

‘సెంచరీ కాదు.. ఎన్ని వికెట్లు పోతాయో చూస్కో’

‘సీఎం విమానం ఎక్కేలోపు.. క్లారిటీ ఇవ్వాలి’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సల్మాన్‌ సినిమా అయితే రూ. 500 కోట్లు..’

రానా చేతుల మీదుగా ‘అనగనగా ఓ ప్రేమకథ’ టీజర్‌

ప్రతినాయక పాత్రలకు సిద్ధం : బాలకృష్ణ

అక్టోబ‌ర్ 5న ‘ప్రేమెంత ప‌నిచేసే నారాయ‌ణ‌’

రాజమౌళి మల్టీస్టారర్‌పై మరో అప్‌డేట్‌

2.ఓ టీంకు డెడ్‌లైన్‌..!