జగన్‌ సీఎం అయితే 45 ఏళ్లకే పింఛన్‌

7 Mar, 2019 14:38 IST|Sakshi
పార్టీలో చేరిన వారికి కండువా వేస్తున్న డాక్టర్‌ సుధాకర్‌

సాక్షి, గూడూరు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి సీఎం అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే వైఎస్సార్‌ చేయూత పథకం కింద పింఛన్‌ వస్తుందని వైఎస్సార్‌ సీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ సుధాకర్‌ తెలిపారు. బుధవారం రాత్రి పట్టణంలో రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టరసుధాకర్‌ దివంగత నేత వైఎస్‌.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. టీడీపీ నాయకుల అవినీతి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపైనే ఉందని సూచించారు. 

100మంది యువకులు పార్టీలో చేరిక.. 
పట్టణానికి చెందిన పి.రంగన్న, ఎస్‌.ఇమ్రాన్, పి.శ్రీనివాసులు, పి.దానియేలు, ఎం.దిలీప్, ఎ.చిన్న,  బి.సురేష్, ఎం,జయకర్, పి.భాషా, బి.మోజెస్‌ మరో 90మంది యువకులు వైఎస్సార్‌ సీపీలో చేరారు. వారికి డాక్టర్‌ సుధాకర్‌ పార్టీ కండు వాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమం లో పార్టీ మండల కన్వీనర్‌ జూలకల్లు భాస్కరరెడ్డి, నాయకులు డీటీ విఠల్, బండి రాజు, బి.రమేష్, చనుగొండ్ల మహేశ్వరరెడ్డి, కె.నాగలాపురం నరసింహారెడ్డి, సుందరం పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు