నామినేషన్లు వేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు

20 Mar, 2019 13:25 IST|Sakshi

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటే చేసే పలువురు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. విజయనగరం శాసనసభ స్థానానికి కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్‌ వేశారు. గంగాధరనెల్లూరు నుంచి నారాయణస్వామి, గుడివాడ నుంచి కొడాలి నాని, కమలాపురం నుంచి రవీంద్రనాథ్‌రెడ్డి, శ్రీకాళహస్తి నుంచి బియ్యపు మధుసుదన్‌ రెడ్డి, రాయచోటి నుంచి శ్రీకాంత్‌ రెడ్డి నామినేషన్లు సమర్పించారు. వైఎస్సార్‌ సీపీ నాయకుల నామినేషన్ల కార్యాక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. 

  • కాకినాడ సిటీ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి నామిషన్ దాఖలు చేశారు. అనందభారతీ మైదానంలో సర్వమత ప్రార్ధనల అనంతరం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆయన నామిషన్‌ వేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ అభ్యర్థి వంగా గీతా, భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 
  • పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు శాసనసభ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తానేటి వనిత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ సమర్పించారు. ఈ నామినేషన్‌ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్‌, అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
  • కర్నూలు జిల్లా ఆదోని శాసనసభ నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా సాయి ప్రసాద్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకురాలు బుట్టా రేణుక పాల్గొన్నారు.
  • నెల్లూరు జిల్లా నాయుడుపేట ఆర్‌డీఓ కార్యాలయంలో సూళ్లురుపేట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా కిలివేటి సంజీవయ్య నామినేషన్‌ వేశారు. ఈ కార్యక్రమంలో వైస్సార్‌సీపీ నేతలు దువ్వూరు బాలచంద్రారెడ్డి, సుధాకర్‌రెడ్డి, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.
  • కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మార్వో కార్యాలయంలో వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రకోట చెన్నకేశవరెడ్డి నామినేషన్‌ వేశారు.
  • వైఎస్సార్‌ సీపీ రాజాంపేట లోక్‌సభ అభ్యర్థి మిథున్‌రెడ్డి తరఫున ఆయన తల్లి స్వర్ణలత నామినేషన్‌ సమర్పించారు.
  • వైఎస్సార్‌ సీపీ గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని నామినేషన్‌ వేశారు. తొలుత పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారు, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నాని అనంతరం నామినేషన్‌ వేయడానికి బయలుదేరారు. ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలిరావడంతో గుడివాడ జనసంద్రంగా మారింది. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు