జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్‌ గా వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి

28 Oct, 2017 12:07 IST|Sakshi

జగ్గయ్యపేట మున్సిపల్‌ ఛైర్మన్‌గా ఇంటూరి రాజగోపాల్‌ ఎన్నిక

సాక్షి, జగ్గయ్యపేట : కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్‌ ఛైర్మన్‌గా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఇంటూరి రాజగోపాల్‌ ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శనివారం ఉదయం ఇంటూరి రాజగోపాల్‌లో మున్సిపల్‌ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు.  మొత్తం 27 మంది కౌన్సిలర్లలో వైఎస్ఆర్‌సీపీకి 16, టీడీపీకి 10, ఇతరులు ఒకటి ఉన్నారు. చైర్మన్ ఎన్నిక వాయిదా వేయాలని టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు. అయితే ఎన్నిక వాయిదాకు ససేమిరా అనడంతో టీడీపీ సభ్యులు వాకౌట్‌ చేశారు. కోరం ఉండటంతో ఇంటూరి రాజగోపాల్‌ ప్రమాణం చేశారు. టీడీపీ నేతల దౌర్జన్యంతో ఛైర్మన్ ఎన్నిక నిన్న వాయిదా పడిన విషయం తెలిసిందే. ఓ వైపు ప్రలోభాలు, మరోవైపు బెదిరింపులకు టీడీపీ పాల్పడినా...వైఎస్‌ఆర్‌ సీపీ కౌన్సిలర్లు ఏమాత్రం లెక్కచేయలేదు. దీంతో  నాటకీయ పరిణామాల మధ్య జగ్గయ్యపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది.

మున్సిపల్‌ ఛైర్మన్‌గా రాజగోపాల్‌ ప్రమాణ స్వీకారం 

మరిన్ని వార్తలు