‘చంద్రబాబు చేతుల్లో ప్రజాస్వామ్యం హతం’

27 Nov, 2017 16:48 IST|Sakshi
ఐవీ రెడ్డి ఫైల్‌ ఫోటో

సాక్షి, ఒంగోలు : ‘అనునిత్యం విలువలతో కూడి రాజకీయం చేస్తాను, విలువలతో కూడిన రాజకీయం చేస్తాను అని.. చంద్రబాబు నాయుడు చెబుతూ ఉంటారు. మరి ఆ విలువలతో కూడిన రాజకీయం అంటే.. ఎమ్మెల్యేలకు వెల కట్టి కొనుక్కోవడమేనా? ఒక్క ఎమ్మెల్యేను పాతిక కోట్ల రూపాయలకు కొనడమా? ఇదేనా ప్రజాస్వామ్యం? చంద్రబాబు అలాంటి చీప్ పొలిటీషియన్ చేతిలో భారత ప్రజాస్వామ్యం హతం అవుతోంది. అనునిత్యం ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యంగ స్ఫూర్తికి తూట్లు పొడుతూ.. చంద్రబాబు నీచ రాజకీయానికి పాల్పడుతున్నారు...’ అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గిద్దలూరు ఇన్‌చార్జ్‌ ఐవీ రెడ్డి ధ్వజమెత్తారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ మరో ఎమ్మెల్యేను కొనుగోలు చేసిన నేపథ్యంలో ఐవీ రెడ్డి సోమవారం  పత్రికా ప్రకటన విడుదల చేసి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు కొనుగోలు రాజకీయాలు చేస్తున్నరు, ఆయనకు దమ్మూ ధైర్యం ఉంటే.. ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు.
‘ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీ వైపు ఫిరాయిస్తున్న వాళ్లు రాజకీయ నీచులు. అధికారం, ధనకాంక్షలతో అనైతిక చర్యకు పాల్పడుతున్నారు. అంతగా అధికార పార్టీలోకి వెళ్లాలి అనుకుంటే.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ద్వారా దక్కిన ఎమ్మెల్యే పదవికి వారు రాజీనామా చేయాలి. దమ్మూధైర్యం ఉంటే.. మళ్లీ పోటీకి సిద్ధం కావాలి.

దారుణం ఏమిటంటే.. అలాంటి దమ్మూ, ధైర్యం, సిగ్గూ శరం అటు.. చంద్రబాబు నాయుడికీ లేవు.. ఇటు ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలకూ లేవు. ఇలాంటి హీనులనా మనం ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంది అని వీరికి ఓట్లేసిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు. ఇలాంటి ఫిరాయింపు నీచ రాజకీయానికి పాల్పడిన వారికి అయినా, వీళ్ల చేత ఇలాంటి పని చేయిస్తున్న చంద్రబాబుకు అయినా రేపటి ఎన్నికల్లో గుణపాఠం చెప్పడానికి రాష్ట్ర ప్రజానీకం ఎదురుచూస్తున్నారు.  చంద్రబాబు ప్రజాస్వామ్యవిలువలను ఎంతగా పాతరేసినా.. ఈ పాపానికంతటికీ తగిన ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల రూపంలో  ప్రజాతీర్పును ఎదుర్కొనడానికి మరెంతో దూరం లేదు. అలాంటి సమయంలో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.’ అని మండిపడ్డారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలోనూ.. అధికార, ప్రతిపక్షం అనే తేడా లేకుండా ఎమ్మెల్యేలందరికీ అభివృద్ధి ఇచ్చారు. అప్పటికీ ఇప్పటికీ తేడా.. నక్కకూ నాకలోకానికి ఉన్నం తేడా ఉంది. చంద్రబాబువి గుంట నక్క రాజకీయాలు.  ఫిరాయింపుదారులు, వీళ్ల ట్రూపుకు పెద్ద చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని మోసం చేయవచ్చు. ఇదంతా తాత్కాలికమే. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోలేని చేతగాని రాజ్యాంగ వ్యవస్థ ఉండవచ్చు. కానీ.. ఈ మోసం కలకాలం సాగదని గుర్తుంచుకోవాలి. ఇంత చేసినా మరో ఏడాది మాత్రమే.. తర్వాత అంతిమ తీర్పు వస్తుంది, తెలుగుదేశం పార్టీ ప్రజా కోర్టులో తీవ్రమైన శిక్షను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలని చంద్రబాబు కలలు కంటున్నట్టుగా ఉన్నాడు. ఎమ్మెల్యేలను చేర్చుకోవడంతోనే అది జరుగుతుందని బాబు అనుకుంటున్నట్టుగా ఉన్నాడు. అది కేవలం పగటి కల మాత్రమే అని ఆయన గుర్తుంచుకోవాలి...’ అని ఐవి రెడ్డి హెచ్చరించారు.


 

మరిన్ని వార్తలు