‘ముందు కుస్తీ పోటీలంటారు.. ఆ తర్వాత..’

14 Jun, 2018 16:55 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న అంబటి రాంబాబు

సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మించక పోవడం అన్యాయమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత అంబటి రాంబాబు తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ నేతలు ఇపుడు గగ్గోలు పెడుతున్నారు.. నాలుగేళ్లు కేంద్రంతో కలిసి ఉన్నపుడు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని కేంద్రం చెప్పింది. కానీ అపుడు ఎన్డీయేలో టీడీపీ ఉంది కాబట్టి ఏమీ మాట్లాడలేదన్నారు. ఆరునెలల్లో ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపడుతామని.. ఆ మేరకు విభజన చట్టంలోని 13 వ షెడ్యూల్‌లో ఉందని తెలిపారు.

దొంగలు పడ్డ ఆరునెలలకు టీడీపీ నేతలు మొరుగుతున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబులు కలిసి రాష్ట్రాన్ని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. విభజన హామీలపై చివరిదాకా పోరాడేది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనే అని స్పష్టం చేశారు. కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకు టీడీపీ దీక్షల డ్రామాలాడుతోందన్నారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని ప్రజలు తిరస్కరించారని, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని విమర్శించే స్థాయి ఆయనకు ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ముందు కుస్తీ పోటీలంటారు.. ఆ తర్వాత మోదీ కాళ్లు పట్టుకుంటారని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు