‘కాంగ్రెస్‌ది బస్సు యాత్ర కాదు.. తీర్థయాత్ర’

22 Feb, 2019 16:23 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి

పొట్టి శ్రీరాములు నెల్లూరు: కాంగ్రెస్‌ది బస్సు యాత్ర కాదు తీర్ధయాత్ర అని వైఎస్సార్‌సీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. నెల్లూరులో ఆనం విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు న్యాయం చేయకుండా ఉమ్మడి రాష్ట్రాన్ని విభజన చేసిన పాత్రధారులు, సూత్రధారులు బస్సు యాత్ర పేరుతో రాబోతున్నారని ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఉనికి కాపాడుకునేందుకే కాంగ్రెస్‌ ప్రత్యేకంగా బస్సుయాత్ర మొదలు పెట్టిందని దుయ్యబట్టారు. ఏ మొహం పెట్టుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందుకు కాంగ్రెస్‌ వాళ్లు వస్తున్నారో చెప్పాలన్నారు.

చంద్రబాబుకు మద్ధతు ఇచ్చేందుకే కాంగ్రెస్‌ బస్సు యాత్ర పేరుతో నాటకాలాడుతోందని వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు తలపెట్టిన యాత్రలు కేవలం చంద్రబాబు కోసమేనని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీనే మొదటి నుంచి పోరాటం చేస్తోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ అంటూ కొత్తపాట పాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం  రుణమాఫీ పేరుతో రైతులని మరింతగా రుణ గ్రస్తులని చేస్తోందని మండిపడ్డారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గురువారం మే 30.. మధ్యాహ్నం 12.23..

రాయపాటికి ఘోర పరాభవం

వైఎస్‌ జగన్‌ దంపతులకు కేసీఆర్‌ ఘన స్వాగతం

రాష్ట్రపతిని కలిసిన ఎన్నికల కమిషనర్లు

17వ లోక్‌సభ ప్రత్యేకతలు ఇవే!

కొత్త ముఖాలు.. కొన్ని విశేషాలు

రాహుల్‌ను బుజ్జగించిన కాంగ్రెస్‌ నేతలు

వాళ్లకు మనకు తేడా ఏంటి : విజయసాయి రెడ్డి

అది తప్పు.. సెల్యూట్‌ నేనే చేశా: గోరంట్ల మాధవ్‌

ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ మునక..?

రేపు ప్రధాని మోదీతో వైఎస్‌ జగన్‌ భేటీ

రద్దయిన 16వ లోక్‌సభ

ఏయే శాఖల్లో ఎన్ని అప్పులు తీసుకున్నారు?

వైఎస్‌ జగన్‌ పర్యటన షెడ్యూల్‌ విడుదల

మెగా బ్రదర్స్‌కు పరాభవం

సొంతూళ్లలోనే భంగపాటు

సోమిరెడ్డి..ఓటమి యాత్ర !

పశ్చిమాన ఫ్యాన్‌ హోరు

అసంతృప్తి! 

కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదు : డీకే అరుణ

 అంతర్మథనం.. 

పవన్‌ నోరు అదుపులో పెట్టుకో..

అయ్యో పాపం విద్యుత్‌ షాక్‌తో బాలుడి మృతి

టీడీపీ నేతలందరూ కలసి వచ్చినా..

రాహుల్‌ రాజీనామా.. తిరస్కరించిన సీడబ్ల్యూసీ

ఎక్కడ.. ఎలా?!

జనం తరిమి కొడతారు జాగ్రత్త

ఉత్తరాంధ్రలోనే భాగ్యలక్ష్మికి భారీ ఆధిక్యత

అతిపిన్న వయస్కురాలైన ఎంపీగా మాధవి

అందుకే నాది గోల్డెన్‌ లెగ్: ఎమ్మెల్యే రోజా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పవన్‌ కళ్యాణ్‌పై జాలేసింది

మరో సినిమా లైన్‌లో పెట్టిన విజయ్‌

ఇక పాకిస్తాన్‌ గురించి ఏం మాట్లడతాం?

‘నిశబ్ధం’ మొదలైంది!

చిన్నా, పెద్ద చూడను!

‘సీత’ మూవీ రివ్యూ