‘గుడివాడలో చంద్రబాబు పోటీ చేసినా గెలుపు మాదే’

14 Mar, 2019 13:22 IST|Sakshi

సాక్షి, గుడివాడ: రాష్ట్రంలో దివాళకోరు రాజకీయాలను ప్రవేశపెట్టింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని వైఎస్సార్‌సీపీ మచిలీపట్నం నియోజకవర్గం సమన్వకర్త బాల శౌరి విమర్శించారు. గురువారం గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు వంచనకు, ధర్మానికి మధ్య జరుగనున్నాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసిన ఓటమి తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు గుడివాడలో పోటీ చేసినా విజయం వైఎస్సార్‌సీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. అందుకే టీడీపీ ఎంపీలు వైఎస్సార్‌ సీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారని తెలిపారు.

చంద్రబాబు మనస్ఫూర్తిగా పోరాడితే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రత్యేక హోదా సాధించి తీరుతుందన్నారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక బందర్‌ పోర్టు నిర్మాణం పూర్తి చేయడంతో పాటు.. కోస్టల్‌ కారిడార్‌ నిర్మాణం చేపడతామని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని.. కృష్ణా డెల్టాకు రెండు పంటలకు నీరందిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబుది టికెట్లు అమ్ముకునే సంస్కృతి అని ఆరోపించారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు