ఎంక్వైరీ చేస్తుంటే భుజాలు తడుముకోవడమెందుకు?

10 Mar, 2019 16:39 IST|Sakshi
బుద్ధా నాగేశ్వర రావు

వైఎస్సార్‌సీపీ నేత బుద్ధా నాగేశ్వరరావు

విజయవాడ:  టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తూ కుట్ర చేస్తోందని బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు, వైఎస్సార్‌సీపీ నేత బుద్ధా నాగేశ్వరరావు ఆరోపించారు. సావిత్రీభాయి పూలే వర్ధంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి విజయవాడలో నివాళులు అర్పించారు.  అనంతరం బుద్ధా విలేకరులతో మాట్లాడుతూ.. డేటా చోరీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంటే ఏపీ ప్రభుత్వం భుజాలు తడుముకోవడం ఎందుకని ప్రశ్నించారు. ఓట్ల తొలగింపుపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్‌ చేశారు. నేటి ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని విమర్శించారు.

మహిళల చదువుకు సావిత్రీబాయి పూలె ఎనలేని కృషి చేశారని కొనియాడారు. భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా సావిత్రీబాయి పూలె పేరు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. మహిళలు వంటింటికే పరిమితం కాదని వారిలో చైతన్యం తీసుకువచ్చారని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు