‘కాంట్రాక్ట్‌ కార్మికులపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు’

22 Nov, 2018 18:02 IST|Sakshi

సాక్షి, విజయవాడ : కాంట్రాక్ట్‌ కార్మికుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి  చిత్తశుద్ధి లేదని వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు గౌతంరెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కాంట్రాక్ట్ కార్మికుల పర్మినెంట్‌కు సంబంధించి వేసిన కేబినెట్ సబ్‌కమిటీ ఇంతవరకూ నివేదిక ఇవ్వలేదని మండిపడ్డారు.

ఇలా కమిటీలు వేయడం.. నివేదికలు విస్మరించడం ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని విమర్శించారు. పర్మీనెంట్ చేసే విషయంలో ఇప్పుడు సుప్రీం ఉత్తర్వులు గుర్తుకొచ్చాయా అని ప్రశ్నించారు. అలాంటప్పుడు ప్రభుత్వం కేబినెట్‌ సబ్‌కమిటీ ఎందుకు వేసిందని నిలదీశారు. కాంట్రాక్ట్‌ కార్మికులను చంద్రబాబు మోసం చేస్తున్నారని, తగిన మూల్యం చెల్లించుకుంటారని గౌతం రెడ్డి పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు