‘సీఎం తన వర్గంతో దొంగ దీక్షలు’

1 Jul, 2018 12:39 IST|Sakshi
గౌతం రెడ్డి

సాక్షి, విశాఖపట్నం : సీఎం చంద్రబాబు నాయుడి తీరుపై వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షులు గౌతం రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం తన వర్గంతో దొంగ దీక్షలు చేయిస్తున్నారని గౌతం రెడ్డి ధ్వజమెత్తారు. అంతేకాక కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఐకేపీ, మెప్మా ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని చెప్పి సీఎం మోసం చేశారు. రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేని పరిస్థితి నెలకుందని వైఎస్సార్‌సీపీ నేత పేర్కొన్నారు.

వైఎస్స్‌ర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం కావడంతోనే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనుల కోసం 30 సంవత్సరాలుగా కార్మికుల పోరాటం చేస్తున్న విషయాన్ని సీఎం పట్టించుకోలేదని ఈ సందర్భంగా  వైఎస్సార్‌సీపీ నేత గౌతం రెడ్డి గుర్తు చేశారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు