డివిజన్‌ వేరు చేయడం అసంతృప్తిగా ఉంది: గుడివాడ

28 Feb, 2019 16:55 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ రావడం శుభపరిణామని వైఎస్సార్సీపీ అనకాపల్లి సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్‌ వ్యాక్యానించారు. విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ.. వాల్తేరు డివిజన్‌ రెండుగా విభజించిడం అసంతృప్తిగా ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ పోరాట ఫలితమే దక్షిణ కోస్తా జోన్‌ రాక అని అన్నారు.  ప్రభుత్వంలో ఉన్న టీడీపీ నేతల బలహీనత కారణంగా వాల్తేరు డివిజన్‌ను విభజించి జోన్‌ ప్రకటించారని విమర్శించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి డివిజన్‌తో కూడా జోన్‌ వచ్చేలా పోరాటం చేస్తామని తెలిపారు. 25 మంది వైఎస్సార్‌సీపీ ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా మెడలు వంచి డివిజన్‌ను యధాతధంగా ఉంచుతామని చెప్పారు. 

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖా మంత్రి పీయూష్‌ గోయల్‌ నిన్న ప్రకటించిన సంగతి తెల్సిందే. రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలంటూ వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంటు సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్‌ గతంలో నాలుగు రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన విషయం విదితమే. అలాగే 201కి.మీల పాదయాత్ర కూడా చేశారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేసిన ధర్నాలు, రాస్తారోకోల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు జోన్‌ను ఇస్తున్నామంటూ ప్రకటన చేసింది.

మరిన్ని వార్తలు