వైఎస్‌ వివేకాకు ఎందుకు భద్రత కల్పించలేదు?

28 Mar, 2019 10:27 IST|Sakshi

సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్యాంగ సంస్థలను అగౌరవపరుస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, రిటైర్డ్‌ ఐజీ ఇక్బాల్‌ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పోలీసు వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లుగా జీవోలు తెస్తూ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారని విమర్శించారు. ఇంటెలిజెన్స్‌ డీజీపీ బదిలీకి ముఖ్యమంత్రి భద్రతకు ఏం సంబంధం ఉంటుందని ప్రశ్నించారు. ఒక అధికారి బదిలీ అయితే మరో అధికారి ఆ డ్యూటీ చేస్తారన్నారు. చంద్రబాబు అభ్యంతరం మేరకు గతంలో డీజీపీ యాదవ్‌ను బదిలీ చేస్తే వైఎస్సార్‌ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇంటెలిజెన్స్‌ పాత్ర కచ్చితంగా ఉంటుందన్నారు. ఇంటెలిజెన్స్‌ వైఫల్యంతోనే వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగిందని ఆరోపించారు. వైఎస్‌ వివేకాకు ఎందుకు భద్రత కల్పించలేదని ప్రశ్నించారు. హిందూపురంలో బాలకృష్ణ బాంబులు వేస్తా.. చంపుతానని ప్రజలను బెదిరిస్తున్నారని చెప్పారు. బావా బామ్మర్దులు కలిసి ఏపీలో అలజడి సృష్టిస్తున్నారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు