‘ఆ విషయం మాత్రం స్పష్టంగా చెప్పడం లేదు’

5 Nov, 2018 14:09 IST|Sakshi

వైఎస్సార్‌ సీపీ నేత ఎండీ ఇక్బాల్

సాక్షి, హైదరాబాద్‌ : ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంలో మీ హస్తం లేకపోతే ఇప్పటికైనా థర్డ్‌ పార్టీ విచారణకు అంగీకరించాలని వైఎస్సార్‌ సీపీ నేత ఇక్బాల్.. సీఎం చంద్రబాబు నాయుడును డిమాండ్‌ చేశారు. ఘటన జరిగి పది రోజులు గడుస్తున్నా కేసులో పురోగతి లేకపోవడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు.

సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నిందితుడు శ్రీనివాస్‌ పదివేల ఫోన్‌ కాల్స్‌ మాట్లాడాడని చెబుతున్నారు. కానీ ఎవరెవరితో మాట్లాడాడో స్పష్టంగా చెప్పడం లేదు. ఎయిర్‌పోర్టులోకి బయట నుంచి కాఫీ తేవొద్దని మూడుసార్లు ఫిర్యాదు చేశారు. ఇది కూడా కుట్రలో భాగమేనని’ ఆయన ఆరోపించారు. ఈ కేసులో సాక్ష్యాలన్నీ తారుమారు చేస్తూ, పథకం ప్రకారమే విచారణను తప్పుదోవ పట్టిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మీద క్రిమినల్‌ కేసు పెట్టాలంటూ ఇక్బాల్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన తప్పేమీ లేదని నిరూపించుకోవాలంటే నిజాలను నిగ్గు తేల్చాలని, అందుకోసం స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఈ కేసు విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు