‘అందుకే బాబు జాతీయ నేతలను కలుస్తున్నారు’

21 May, 2019 12:54 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి జిల్లా : తెలుగువారి గౌరవాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ స్థాయిలో పరువు తీస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు విమర్శించారు. ఓడిపోతామని భయంతో చంద్రబాబు రకరకాల వేషాలు వేస్తూ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు టీడీపీని రాజకీయాల నుంచి ఎగ్జిట్‌ అయ్యేలా చేశాయని ఎద్దేవా చేశారు. 2024 కల్లా టీడీపీ ముక్కలైపోతుందని తెలిసి చంద్రబాబు నాయుడు జాతీయ నేతలను డిస్ట్రబ్‌ చేస్తున్నారని ఆరోపించారు.

ప్రజా తీర్పును హుందాగా గౌరవించాల్సింది పోయి చంద్రబాబు రకరకలా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ 150 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వస్తే 30-40 ఏళ్లు పాలిస్తారని తెలిసి చంద్రబాబుకు వణుకుపుట్టుకుందన్నారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్‌, న్యాయ స్థానాలు, జాతీయ నాయకులను కలవడం అయిపోయింది కనక చివరగా చంద్రబాబు ఓ మానసిన వైద్యుడిని కలిస్తే మంచిదని ఎద్దేవా చేశారు. మే 23న వచ్చే ఫలితాలు ఎగ్జిట్‌ పోల్స్‌ను మించి ఉంటాయని, వైఎస్‌ జగన్‌ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చంద్రబాబుకు మతి భ్రమించింది : భరత్‌
లగడపాటి సర్వే చూసి యువత బెట్టింగ్‌కు పాల్పడవద్దని రాజమండ్రి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మార్గాని భరత్‌ కోరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తన తప్పులకు భయపడే అన్ని పార్టీల నాయకుల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు మతి భ్రమించిందని, అందుకే ప్రజా తీర్పును జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. మే 23 తర్వాత వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో ఏపీలో రాజన్న రాజ్యం రావడం తథ్యం అన్నారు.

మరిన్ని వార్తలు