రాయలసీమను కోనసీమ చేస్తారా?

19 May, 2018 12:13 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టింది దివంగత ముఖ్యమంత్రి వైఎఎస్‌ రాజశేఖరరెడ్డేనని.. రాయలసీమ సాగునీటి కోసం వైఎస్సార్‌, చంద్రబాబు ఎవరేం చేశారో చర్చకు సిద్దమా అంటూ పార్థసారథి టీడీపీ నాయకులైన ఆదినారాయణ రెడ్డి, దేవినేని ఉమాకు సవాల్‌ విసిరారు.  వైఎస్సార్‌ జిల్లా జయరాజ్‌ గార్డెన్స్‌లో శనివారం ఏర్పాటుచేసిన కమలాపురం, జమ్మలమడుగు బూత్‌ కమిటీల శిక్షణా కార్యక్రమానికి హాజరైన పార్థసారిథి మాట్లాడుతూ... రాయలసీమను కోనసీమ చేస్తారా.. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచినప్పుడు ధర్నా చేసిన ఉమా ఇప్పుడు సీమ గురించి మాట్లాడతాడా అంటూ ఆయనపై ధ్వజమెత్తారు.

రాయలసీమ ప్రజలు దేవినేని ఉమను నిలదీయాలని పిలుపునిచ్చారు. బీసీలను హైకోర్టు జడ్జి కాకుండా అడ్డుకునేందుకు లేఖ రాసిన ఘనుడు చంద్రబాబు అని పేర్కొన్నారు.మైనార్టీల గురించి ఆలోచించిన మొదటివ్యక్తి వైఎస్సార్‌ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు  సజ్జల రామకృష్ణా రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఐటీ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు, సమన్వయకర్తలు డాక్టర్ సుధీర్ రెడ్డి, దుగ్గాయపల్లి మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు