‘జర ఓపిక పట్టు తమ్మీ’

30 Jul, 2019 11:28 IST|Sakshi

సాక్షి, అమరావతి : కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల్లో భాగంగానే టాటా సంస్థ ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి సేవ చేస్తుందని వైఎస్సార్‌సీపీ నేత, పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) అన్నారు. కానీ కొంత మంది తామే టాటా సంస్థను ఏపీ తెచ్చామని డబ్బాలు కొట్టుకోవడం విడ్డూరంగా ఉందని పరోక్షంగా చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలను ఉద్దేశించి విమర్శించారు. వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేసే వారు కాస్త ఓపికతో ఉండాలని, త్వరలోనే సీఎం జగన్‌ వైద్యవ్యవస్థలో మార్పులు తెచ్చి ఆరోగ్యశ్రీకి మళ్లీ పుర్వవైభవాన్ని తీసుకోస్తారని చెప్పారు. ‘అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు  టాటాను నేనే తెచ్చా అని డబ్బా ఏంటప్ప. సీఎస్ఆర్ కింద అన్ని కంపెనీలు చేయవలసిన సామాజిక సేవ అది. ఆరోగ్యశ్రీ అనే సంచలనం మన దేశంలో జరిగింది. కొన ఊపిరితో ఉన్న వైద్య వ్యవస్థకు సంజీవని ఇచ్చి మళ్ళీ పూర్వవైభవాన్ని తీసుకురాబోతున్నారు వైఎస్ జగన్. జర ఓపిక పట్టు తమ్మీ’ అని పీవీపీ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు