మంత్రికి క్లబ్, పేకాట శాఖలపైనే పట్టుంది

15 May, 2018 12:35 IST|Sakshi
మైలవరం నుంచి పాదయాత్రగా వస్తున్న సమన్వయకర్త, వైఎస్సార్‌సీపీ నాయకులు

సమన్వయకర్త డాక్టర్‌ సుధీర్‌రెడ్డి

సంవత్సరాలు గడుసున్నా టెక్స్‌టైల్‌ పార్కు గాలికి వదిలేశారు

చేనేతల గురించి పట్టించుకోని మంత్రి ఆది

జమ్మలమడుగు/మైలవరం : మంత్రి ఆదినారాయణరెడ్డి తనకు కేటాయించిన శాఖల కంటే క్లబ్, పేకాట శాఖలపైనే పట్టు ఉందని ప్రభుత్వం ఆ శాఖలను కేటాయించి ఉంటే బాగుండేదని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మైలవరం మండల కేంద్రం పాతబస్టాండ్‌ వద్ద నుంచి జగన్‌ పాదయాత్ర రెండువేల కిలోమీటర్లు దాటినందుకు ఆయనకు మద్దతుగా మైసూరారెడ్డి తనయుడు  హర్షవర్థన్‌రెడ్డి, కార్యకర్తలు, నాయకులతో కలిసి సంఘీభావ పాదయాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా వేపరాల గాంధీ విగ్రహం వద్ద, దొమ్మరనంద్యాల గ్రామంలోని చావిడి వద్ద జరిగిన బహిరంగ సభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి ఆదినారాయణరెడ్డి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా గెలిచి తన స్వార్థప్రయోజనం కోసం పార్టీ ఫిరాయించాడు. పైగా పార్టీ మారింది ప్రజల అభివృద్ధి కోసమంటూ అసత్యప్రచారం చేస్తున్నారన్నారు.

ఆయన పార్టీ మారింది కేవలం ఆయన అభివృద్ధి చెందడానికే అన్నారు. చేనేత కార్మికుల కోసం మైలవరం మండలంలోని నార్జాంపల్లి గ్రామ రహదారిలో  చేనేతల కోసం టెక్స్‌టైల్‌ పార్కును ఏర్పాటు చేశారు. దాదాపు తొమ్మిది సంవత్సరాలైన ఇంత వరకు ఎటువంటి ప్రారంభానికి నోచుకోలేదు. చేనేత కార్మికులపైనే ఏమాత్రం శ్రద్ధ తీసుకోవడం లేదన్నారు. అంతేకాకుండా మోరగుడి, దొమ్మరనంద్యాల, వేపరాల గ్రామాల్లో తయారైన చేనేత వస్త్రాలకు ఎటువంటి పేటెంట్‌ లేదు. ఇక్కడ తయారు చేసిన వస్త్రాలు ధర్మవరం, కంచి పట్టుచీరలంటూ అమ్ముకుంటున్నారన్నారు. మైలవరం మండలంలో 29వేల మంది ఓటర్లు ఉన్నారు. వారికందరికి ప్రభుత్వం సంక్షేమ పథకాల కింద 200 ఇళ్లను కేటాయించింది. 

మండలంలో నిరుపేదలకు కనీసం రెండు వందల ఇళ్లు ఏమాత్రం సరిపోతాయని విమర్శించారు. మంత్రి ఆదినారాయణరెడ్డి కేవలం తనస్వార్థ ప్రయోజనాలు చూసుకుంటూ ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశారన్నారు. ఎన్నికల సమయంలో ప్రజల ఓట్లును నోటుతో కొంటానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటువంటి వ్యక్తికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే చేనేత కార్మికులకు 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి రూ.2000 పెన్షన్‌ ఇస్తారన్నారు. దానితో పాటు మైలవరం జలాశయంపై ఆధారపడి ఉన్న మత్స్యకారులను ఆదుకుంటామన్నారు. ఆదేవిధంగా చేనేత కార్మికుల సమస్యలను దారి పొడవున అడిగి తెలుసుకుంటూ వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే సమస్యలను పరిష్కరిస్తామని వైఎస్సార్‌సీపీకి ప్రజలు అండగా నిలవాలంటూ ఆయన కోరుతూ వచ్చారు.

నీరాజనాలు పలికిన ప్రజలు
ప్రతిపక్షనాయకుడు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర రెండువేల కిలోమీటర్లు దాటిన సందర్భంగా ఆయనకు మద్దతుగా డాక్టర్‌ సుధీర్‌రెడ్డి, మైసూరారెడ్డి తనయుడు హర్షవర్థన్‌రెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పలికారు. దాదాపు ఐదున్నర కిలోమీటర్ల దూరం జరిగిన ఈ పాదయాత్ర మైలవరం మండల కేంద్రం నుంచి ప్రజలు నీరాజనాలు పలికారు. ఈ పాదయాత్రలో సీనియర్‌ నాయకుడు  మాజీ జెడ్పీటీసీ అల్లె చెన్నారెడ్డి, రామాంజనేయ యాదవ్, రాష్ట్ర యువజన కార్యదర్శి హనుమంతరెడ్డి, పట్టణ అధ్యక్షుడు పోరెడ్డి మహేశ్వరరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు జయరామకృష్ణారెడ్డి, దేవిరెడ్డి మహేశ్వరరెడ్డి, జిల్లా మైనార్టీ కార్యదర్శి మున్నా, మాబాష, ఇస్మాయిల్, దళిత నాయకుడు మంగదొడ్డి సింగరయ్య, పెద్దముడియం నాయకులు చవ్వాక్రిష్ణారెడ్డి, ప్రకాష్‌రెడ్డి, బీసీ జిల్లా కార్యదర్శి పాలూరి నరసింహులు, రామకృష్ణ, గురుమూర్తి, దొమ్మరనంద్యాల సుబ్బిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పార్టీ జెండానుఆవిష్కరించిన సుధీర్‌రెడ్డి
మైలవరం : మండల కేంద్రంలో నాలుగురోడ్ల కూడలిలో వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త సుధీర్‌రెడ్డి సోమవారం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర 2000 కీలోమీటర్ల మైలురాయిని దాటడంతో మండలంలో పాదయాత్రను చేపట్టారు. నాలుగు రోడ్ల కూడలి నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర 5 కిలోమీటర్లు కొనసాగి దొమ్మరనంద్యాల ఉన్నత పాఠశాల వరకు చేరి పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో మైసూరారెడ్డి తనయుడు హర్షవర్థన్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అల్లె చిన్నచెన్నారెడ్డి, వద్దిరాల రామాంజనేయులు యాదవ్, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్వరరెడ్డి, చిన్నకొమెర్ల శివగురివిరెడ్డి, జమ్మలమడుగు పట్టణ అధ్యక్షులు పోరెడ్డి మహేశ్వరరెడ్డి, హనుమంతరెడ్డి, పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి జయరామక్రిష్ణారెడ్డి, రామక్రిష్ణ, మున్నా, ఇస్మాయిల్, ఆయా గ్రామాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు