బాబు అవినీతి చిట్టాను పార్లమెంట్‌ సాక్షిగా చాటుతాం

6 Jan, 2019 17:14 IST|Sakshi

చంద్రబాబు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు

ఎన్‌ఐఏ దర్యాప్తుకు టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారు?

వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

సాక్షి, గుంటూరు : భారత రాజ్యాంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అపహాస్యం చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. చంద్రబాబుకు చట్టాల మీద నమ్మకం లేదని, ఆయనకు దమ్ము, ధైర్యం లేకనే వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏకు సహకరించడం లేదని మండిపడ్డారు. సోమవారం ఢిల్లీ వెళ్తున్నామని, అవినీతి చక్రవర్తి చంద్రబాబు పాల్పడిన రూ. ఆరు లక్షల 17వేల కోట్ల అవినీతి చిట్టాను పార్లమెంట్ సాక్షిగా వివరిస్తామని ఉమ్మారెడ్డి తెలిపారు. ఆదివారం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు.
దర్యాప్తు కోసం ఎన్ఐఏ రంగంలోకి దిగగానే టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు.

రాజ్యాంగపరంగా ఉన్న ఏజెన్సీలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కానీ, నిన్న (శనివారం) విశాఖపట్నం వచ్చిన ఎన్ఐఏ అధికారుల బృందానికి పోలీసులు సహరించకపోవడం చాలా దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలను చంద్రబాబు అడుగుపెట్టనివ్వడం లేదని, కానీ, టీడీపీ నేతలు కిడారి సర్వేశ్వర్‌రావు, సోమ హత్య కేసులో మాత్రం ఎన్ఐఏ విచార జరపాలని చంద్రబాబు కోరుతున్నారని, ప్రభుత్వం వైఖరిని వైఎస్సార్‌సీపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు